Virat Kohli: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు సాధించాడు. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీ పేరు మీద పెవిలియన్ పెట్టారు. విరాట్ కోహ్లీ గౌరవార్థం ఈ పెవిలియన్‌కు విరాట్ కహోలీ పెవిలియన్ అని పేరు పెట్టారు.


ప్రస్తుతం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, ముంబై జట్ల మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది. ఈ పెవిలియన్‌కు విరాట్ కోహ్లీ పెవిలియన్ అని పేరు పెట్టాలని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు.


నిజానికి క్రికెట్ గ్రౌండ్స్‌లో చాలా మంది మాజీ ఆటగాళ్ల పేర్లతో పెవిలియన్‌లు ఉన్నాయి. కానీ ప్రస్తుత ఆటగాడి పేరు మీద పెవిలియన్‌లు పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. విరాట్ కోహ్లీ పెవిలియన్‌పై అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని నిరంతరం తెలియజేస్తున్నారు.


శ్రీలంక సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌
గతంలో శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో భారత జట్టు 3-0తో విజయం సాధించడం గమనార్హం. ఈ సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు చేశాడు. తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 113 పరుగులు చేశాడు.


సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ 110 బంతుల్లో అజేయంగా 166 పరుగులు చేశాడు. సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌కు విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు.


ఈ నెలలోనే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో తను ఒక్క సెంచరీ చేసినా 75 సెంచరీల మార్కును దాటుతాడు.