Patanjali Enters Sports Nutrition: న్యూట్రెలాతో స్పోర్ట్స్ న్యూట్రిషన్ మార్కెట్‌లో పతంజలి ఎంట్రీ, అథ్లెట్లకు సహజ ప్రోత్సాహం
Patanjali Sports Nutrition Market | ఆయుర్వేద దిగ్గజం పతంజలి క్రీడాకారుల పోషణ కోసం స్పోర్ట్స్ న్యూట్రిషన్ రంగంలోకి ప్రవేశించింది. అథ్లెట్ల కోసం సహజమైన, రసాయన రహిత సప్లిమెంట్లు న్యూట్రేలాని తెచ్చింది.

Patanjali Nutrition Market With Nutrela | భారత మార్కెట్‌లో ఆయుర్వేద ఉత్పత్తులకు పేరుగాంచిన పతంజలి ఇప్పుడు స్పోర్ట్స్ న్యూట్రిషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. Nutrela బ్రాండ్ పేరిట ప్రారంభించిన ఉత్పత్తులు అథ్లెట్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికులకు ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాయని కంపెనీ ప్రకటించింది. ‘Nutrela Sports Whey Performance’ వంటి సప్లిమెంట్లు ప్రోటీన్, క్రియేటిన్ మోనోహైడ్రేట్ సహా బయో-ఫెర్మెంటెడ్ విటమిన్లతో సమృద్ధిగా ఉన్నాయని పతంజలి తెలిపింది. ఈ ఉత్పత్తులలో చక్కెర కలపరు. గ్లూటెన్-రహితంగా, GMO లేకుండా ఉంటాయి. ఇవి మానవ శరీరానికి సహజమైన ప్రోత్సాహాన్ని అందిస్తాయి. రసాయన ఆధారిత సప్లిమెంట్లు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో పతంజలి తీసుకున్న ఈ నిర్ణయం భారత అథ్లెట్లకు అందుబాటులోకి వచ్చింది. క్రమంగా సురక్షితమైన ఎంపికగా మారుతోంది.
వేగంగా కండరాలు కోలుకోవడానికి సహాయపడే ఉత్పత్తులు
పతంజలి ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉత్పత్తులలో అధిక నాణ్యత గల ప్రోటీన్‌ను ఉపయోగించాం. ఇది ఆటగాళ్ల కండరాలు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఉండటంతో వ్యాయామాలు ఎక్కువసేపు, కాస్త కఠినంగా ఉంటాయి, అయితే జీర్ణ ఎంజైమ్‌లు త్వరగా గ్రహించడంలో దోహదం చేస్తాయి. బయో-ఫెర్మెంటెడ్ విటమిన్లు ఆటగాళ్ల అలసటను తగ్గిస్తాయి. అధిక శక్తి స్థాయిలను మెయింటైన్ చేస్తాయి. ఈ సప్లిమెంట్లు బాడీబిల్డర్లు, జిమ్‌లకు వెళ్ళేవారు, ఇతర యాక్టివ్ వ్యక్తుల కోసం రూపొందించారు. అమెజాన్, పతంజలి వెబ్‌సైట్‌లో లభించే ఈ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉత్పత్తులు సులభంగా ఇంటికి డెలివరీ చేస్తాం. ఇది బిజీగా ఉండే అథ్లెట్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని” వివరించారు.
ఇది గేమ్-ఛేంజర్ ఎలా అవుతుంది?
స్పోర్ట్స్ న్యూట్రిషన్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఆయుర్వేద పద్ధతుల ఆధారంగా సహజమైన పదార్థాలను కలిగి ఉంటాయి. తరచుగా దుష్ప్రభావాలను కలిగించే సప్లిమెంట్ల మాదిరిగా కాకుండా, ఇవి వంద శాతం సహజమైనవి. నిషేధిత పదార్థాలు లేకుండా ఇవి తయారవుతాయి. అథ్లెట్లు కండరాల పెరుగుదల, బలం, కోలుకోవడంలో వేగం గమనిస్తారు. ఉదాహరణకు తీవ్రమైన శిక్షణ తర్వాత ఈ ప్రోటీన్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరిచే ముఖ్యమైన పోషకాలను మీకు అందిస్తుంది. వినియోగదారులు ఎక్కువసేపు వ్యాయామం చేస్తున్నారని, అలసట తగ్గిందని తాజాగా చేసిన సమీక్షలు చెబుతున్నాయి. ఇది దిగుమతి చేసుకున్న బ్రాండ్‌ల కంటే 30–40% తక్కువ ధరకే లభించడంతో ఇది భారతీయ అథ్లెట్లకు చాలా లాభదాయకం” పతంజలి ఓ ప్రకటనలో పేర్కొంది.
నాణ్యమైన పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తుంది
“భారతదేశంలో క్రీడా సంస్కృతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. యువత ఆటలపై ఫోకస్ చేస్తున్నారు. కానీ వారికి నాణ్యమైన పోషకాహారం కొరత ఉంది. ఈ కొత్త న్యూట్రిషన్ వారిలో పోషకార లోపాన్ని భర్తీ చేస్తుంది. ఒలింపిక్ గేమ్స్, జాతీయ స్థాయి అథ్లెట్లు దీన్ని తీసుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే ఇది సహజమైన, నమ్మకమైన స్థానిక బ్రాండ్. భవిష్యత్తులో ఇది యువ తరానికి నేచురల్ ఫిట్‌నెస్ జీవనశైలికి మార్గనిర్దేశం చేస్తుందని” పతంజలి పేర్కొంది.
ఈ ఉత్పత్తులు స్థిరమైన సోర్సింగ్ ద్వారా తయారు చేస్తారు, ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని పతంజలి కంపెనీ పేర్కొంది. మొత్తంమీద పతంజలి స్పోర్ట్స్ న్యూట్రిషన్ అథ్లెట్లు, ఆటగాళ్లు, జిమ్ చేసే వారి పనితీరును పెంచడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందిస్తుంది.





















