రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఏకంగా 35వ సారి లాలిగా టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఎస్పాన్యోల్ క్లబ్‌పై రియల్ మాడ్రిడ్ 4-0తో విజయం సాధించింది. రోడ్రిగో రెండు గోల్స్ సాధించగా... మార్కో ఆసెన్సియో, కరీం బెంజెమా చెరో గోల్ సాధించారు. నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే మాడ్రిడ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
కేవలం డ్రా చేసుకుంటే టైటిల్ సాధిస్తారు అనే పరిస్థితిలో మాడ్రిడ్ బరిలోకి దిగింది. కేవలం 33 నిమిషాల్లోనే రోడ్రిగో మాడ్రిడ్‌కు మొదటి గోల్ అందించాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే ఈ బ్రెజిలియన్ ఫుట్ బాలర్ మరో గోల్ సాధించాడు.
అసెన్సియో కూడా మ్యాచ్‌లో మూడో గోల్ సాధించడంతో మాడ్రిడ్ విజయం దాదాపు ఖాయం అయింది. దీంతో చాంపియన్స్ లీగ్ రెండో దశ కోసం కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చింది. మాంచెస్టర్ సిటీతో బుధవారం ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత బెంజెమా నాలుగో గోల్ సాధించడం మాడ్రిడ్ ఆనందాల్లో మునిగిపోయింది. యూరోప్‌లోని టాప్-5 లీగ్స్ అయిన ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌ల్లో టైటిల్స్ సాధించిన మొదటి మేనేజర్‌గా అన్సెలోట్టి నిలిచాడు.