Virat Kohli Surpasses MS Dhoni , Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డు - ధోనీ, రోహిత్ లను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి!
రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 279వ మ్యాచ్ ఆడి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Virat Kohli Surpasses MS Dhoni & Rohit Sharma To Become Most Capped Player In IPL: ఐపీఎల్ 2026 సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. బుధవారం రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో కోహ్లీ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇది విరాట్ కోహ్లీకి ఐపీఎల్ కెరీర్‌లో 279వ మ్యాచ్. దీనితో లీగ్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. గతంలో ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ పేరు మీద ఉండేది. వీరిద్దరూ తలో 278 మ్యాచ్‌లతో కోహ్లీతో సమానంగా ఉండగా, తాజా మ్యాచ్‌తో విరాట్ అందరికంటే ముందు వరుసలో నిలిచాడు.
దిగ్గజాలను అధిగమించిన రన్ మెషీన్..
ఐపీఎల్ అంటేనే రికార్డుల వేదిక, అలాంటిది ఈ మెగా టోర్నీలో మోస్ట్ క్యాప్డ్ ప్లేయర్‌గా నిలవడం సామాన్యం కాదు. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో ఇంకా మైదానంలోకి దిగలేదు. మరోవైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. వీరిద్దరినీ వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ ఈ సరికొత్త శిఖరాన్ని చేరుకున్నాడు. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం ఒకే ఫ్రాంచైజీ తరపున ఇన్ని మ్యాచ్‌లు ఆడటం కోహ్లీ అంకితభావానికి నిదర్శనం అని క్రికెట్ విశ్లేషకులు కొనియాడుతున్నారు.
Also Read:పవర్‌ప్లేలో నయా రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ
టాస్ గెలిచిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ వేటలో బెంగళూరు..
ఈ కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే రెండో ఇన్నింగ్స్‌లో బౌన్స్ మారే అవకాశం ఉందని, అందుకే ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు పాటిదార్ తెలిపాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో రెండో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించిన బెంగళూరు టీమ్, అదే జోరును కొనసాగించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవాలని పట్టుదలతో ఉంది. జట్టులోని ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉండటం ఆర్సీబీకి ప్లస్ పాయింట్ అవుతోంది.
Also Read:ఐపీఎల్ 2026 క్రేజ్.. టాప్-5 మోస్ట్ టాక్డ్ ప్లేయర్స్ లిస్ట్.. కోహ్లీ హవా మామూలుగా లేదుగా.. మిగతా ప్లేయర్లు ఎవరంటే!
తిరుగులేని ఫామ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్..
మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే కూడా తమకు బౌలింగ్ చేయడమే ఇష్టమని చెప్పాడు. కేకేఆర్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ, గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. సీజన్ ఆరంభంలో తడబడిన త్రీ-టైమ్ ఛాంపియన్స్, ఇప్పుడు సరైన టైమింగ్‌లో పుంజుకున్నారు. ప్రతి మ్యాచ్‌ను ఒక్కో అడుగుగా భావిస్తూ సింపుల్‌గా ప్లాన్ చేస్తున్నామని రహానే తెలిపాడు. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కేకేఆర్‌కు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించిన ఈ మ్యాచ్‌లో గెలిచి తమ విజయ పరంపరను ఐదుకు పెంచాలని కోల్‌కతా చూస్తోంది.
Before You Go
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















