హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా విరాట్ కోహ్లీ అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ లో ఆడటం లేదు. బీసీసీఐ సోర్సెస్ ఈ విషయాన్ని ధృవీకరించాయి.
Virat Kohli Ruled Out: ఆఫ్గాన్ తో సిరీస్ కు కోహ్లీ దూరం?: గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్.. రోహిత్ పై కూడా వీడని సస్పెన్స్..
ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా అఫ్గానిస్తాన్ తో జరగబోయే వన్డే సిరీస్ కు దూరమయ్యాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

- విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో అఫ్గానిస్తాన్ సిరీస్‌కు దూరం.
- కెప్టెన్ రోహిత్ శర్మ లభ్యతపై ఫిట్‌నెస్ ఆధారంగా సందిగ్ధత నెలకొంది.
- కోహ్లీ యువ ఆటగాళ్లకు మ్యాచ్ పరిస్థితులపై ఆడాలని సలహా ఇచ్చారు.
- కేవలం పవర్ హిట్టింగ్ కాకుండా, సింగిల్స్ రొటేట్ చేయడం నేర్పాడు.
Virat Kohli Ruled Out Of Afghanistan ODI Series: ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అఫ్గానిస్తాన్ తో జరగబోయే వన్డే సిరీస్ కు దూరం కానున్నాడు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అతడు ఈ సిరీస్ లో ఆడటం లేదని బీసీసీఐ సోర్స్ కన్ఫర్మ్ చేసింది. జూన్ 13 నుంచి ధర్మశాలలో ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. రీసెంట్ గా ముగిసిన ఐపీఎల్ 2026 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విన్నింగ్ రన్స్ కొట్టి ఆర్సీబీని చాంపియన్ గా నిలిపాడు. ఈ లోపే అతడు ఇంజూరీ బారిన పడటం ఫ్యాన్స్ ను నిరాశపరుస్తోంది.
ఫిట్ నెస్ పైనే రోహిత్ శర్మ ఫ్యూచర్
మరోవైపు టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ వన్డే సిరీస్ లో ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఫిట్ నెస్ సాధిస్తేనే అతడు సిరీస్ లో ఆడాలనే కండిషన్ తో సెలెక్టర్లు స్క్వాడ్ లోకి తీసుకున్నట్లు రిపోర్ట్ చెప్తోంది. కోహ్లీ కంప్లీట్ గా రూల్ అవుట్ అవ్వడం, రోహిత్ లభ్యతపై సస్పెన్స్ కొనసాగుతుండటంతో అఫ్గాన్ సిరీస్ కు ఇండియా ఏ కాంబినేషన్ తో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే కీలక ప్లేయర్స్ ఇంజూరీల బారిన పడటం టీమ్ మేనేజ్‌మెంట్ కు పెద్ద తలనొప్పిగా మారింది.
Read Also: Lalit Modi Interview:"నేను, మోదీ చాలా క్లోజ్, త్వరలోనే భారత్ వస్తాను" లలిత్ మోడీ కీలక స్టేట్మెంట్
మోడ్రన్ క్రికెట్ లో సక్సెస్ మంత్ర.. యంగ్ క్రికెటర్లకు కోహ్లీ సాలిడ్ అడ్వైజ్
ఈ సిరీస్ కు దూరం కావడానికి ముందే విరాట్ కోహ్లీ మోడ్రన్ క్రికెట్ లో తన బ్యాటింగ్ స్టైల్ లో వచ్చిన మార్పుల గురించి మాట్లాడాడు. రాబోయే జనరేషన్ ఇండియన్ క్రికెటర్లు తన జర్నీ నుంచి ఎలాంటి లెసన్స్ నేర్చుకోవాలో వివరించాడు. మ్యాచ్ సిట్యుయేషన్ ను సరిగ్గా అర్థం చేసుకుని, దానికి తగ్గట్లు ఆడాలని యంగ్ ప్లేయర్లకు సూచించాడు. ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించి, ఈ సీజన్ లో భారీగా రన్స్ చేసిన కోహ్లీ గేమ్ లో ఎక్కువ కాలం కొనసాగడానికి నిరంతరం ఇంప్రూవ్ అవ్వడం, మారుతున్న పరిస్థితులకు అడాప్ట్ అవ్వడమే కీలకం అని చెప్పాడు.
సిక్సర్లు మాత్రమే కాదు..సింగిల్స్ రొటేట్ చేయడం ..
సక్సెస్ అనేది కేవలం పవర్ హిట్టింగ్ పైనే ఆధారపడి ఉండదని కోహ్లీ స్పష్టం చేశాడు. మ్యాచ్ పరిస్థితులను రీడ్ చేయడం, వేర్వేరు పద్ధతుల్లో టీమ్ కు కాంట్రిబ్యూట్ చేయడం నేర్చుకోవాలని అన్నాడు. పిచ్ కఠినంగా ఉన్నప్పుడు కేవలం సిక్సర్ల కోసమే ట్రై చేయకుండా బౌండరీలు కొట్టేలా ప్రిపరేషన్ ఉండాలని చెప్పాడు. అది కూడా కుదరని పక్షంలో సింగిల్స్ రొటేట్ చేస్తూ స్ట్రైక్ మార్చడం ద్వారా గేమ్ లో ఇన్ వాల్వ్ అయి ఉండాలని సలహా ఇచ్చాడు. తను ఎప్పుడూ ఇంప్రూవ్ అవుతూ, టీమ్ స్కోరుకు హెల్ప్ అయ్యేలా ఆడటం పైనే ఫోకస్ పెడతానని విరాట్ ఒక వీడియోలో వివరించాడు.
Frequently Asked Questions
విరాట్ కోహ్లీ అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ నుండి ఎందుకు దూరమయ్యాడు?
రోహిత్ శర్మ అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ లో ఆడతాడా?
రోహిత్ శర్మ ఫిట్ నెస్ సాధిస్తేనే సిరీస్ లో ఆడతాడు. అతని లభ్యతపై ఇంకా స్పష్టత లేదు, సస్పెన్స్ కొనసాగుతోంది.
యువ క్రికెటర్లకు విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహా ఏమిటి?
మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని, దానికి తగ్గట్లు ఆడాలని కోహ్లీ సూచించాడు. నిరంతరం మెరుగుపరచుకోవడం, మారుతున్న పరిస్థితులకు అలవాటు పడటమే కీలకమని తెలిపాడు.
ట్రెండింగ్ వార్తలు



















