అన్వేషించండి

Virat Kohli , MS Dhoni News: ఐపీఎల్ 2026 క్రేజ్.. టాప్-5 మోస్ట్ టాక్డ్ ప్లేయ‌ర్స్ లిస్ట్.. కోహ్లీ హవా మామూలుగా లేదుగా.. మిగతా ప్లేయర్లు ఎవరంటే!

ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ దశకు చేరువవడంతో పోటీ రసవత్తరంగా మారింది. స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన సర్వేలో విరాట్ కోహ్లీ, ధోనీ అత్యధికంగా చర్చల్లో నిలిచిన ఆటగాళ్లుగా నిలిచారు.

Virat Kohli and MS Dhoni Top Most Talked About Players: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్‌లో జోష్ మామూలుగా లేదు. గ్రౌండ్ లో ప్లేయర్స్ సిక్సర్లు, ఫోర్లతో అలరిస్తుంటే.. బయట సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ వార్స్ పీక్స్ లో ఉన్నాయి. ఎనిమిది జట్లు ప్లేఆఫ్స్ బెర్త్ కోసం పోటీ పడుతుండటంతో ప్రతి మ్యాచ్ ఇప్పుడు నాకౌట్ లా మారిపోయింది. ముఖ్యంగా గుజ‌రాత్ 16 పాయింట్ల‌తో దూసుకుపోతుండ‌గా, ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ జ‌ట్లు  14 పాయింట్లు సాధించి సేఫ్ జోన్ లో ఉండాలని చూస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ కూడా 13 పాయింట్లతో గట్టి పోటీ ఇస్తోంది.

కోహ్లీ హవా.. ధోనీ మ్యాజిక్..
స్టార్ స్పోర్ట్స్ మార్చి 28 నుండి మే 12 వరకు సేకరించిన డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది చర్చించుకున్న ఆటగాళ్ల జాబితాలో కింగ్ కోహ్లీ 44 శాతంతో టాప్ లో ఉన్నాడు. కోహ్లీ బ్యాటింగ్, గ్రౌండ్ లో అతని అగ్రెసివ్ నెస్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే 21 శాతంతో రెండో స్థానంలో నిలిచాడు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే తగిలిన కాలి గాయం (Calf Injury) వల్ల ధోనీ ఈ సీజన్ కు దూరమయ్యాడు. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం ధోనీ నామస్మరణ ఆపడం లేదు.

లిస్టులో ఉన్న ఇతర స్టార్ ప్లేయర్స్..
ధోనీ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 18 శాతంతో మూడో స్థానంలో ఉన్నాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓపెన‌ర్ క‌మ్ వికెట్ కీప‌ర్ సంజూ శామ్సన్ (10%), ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓపెన‌ర్ క‌మ్ వికెట్ కీప‌ర్ కెఎల్ రాహుల్ (8%) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరపున మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ రికార్డులు బద్దలు కొడుతున్నా.. సీనియర్ ఆటగాళ్ల క్రేజ్ ముందు అతనికి ఈ లిస్టులో చోటు దక్కలేదు. 36 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న వైభవ్ భవిష్యత్తులో పెద్ద స్టార్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ధోనీపై అభిషేక్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ చూసి బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా ఫిదా అయ్యాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంభం కాబోతున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) లో ధోనీ ఆడితే చూడాలని ఉందని అభిషేక్ తన మనసులో మాట బయటపెట్టాడు. ధోనీ వంటి ఆటగాడిని చూడటానికి ప్రత్యేకంగా కారణాలు వెతకాల్సిన అవసరం లేదని, అతను ఎక్కడ ఆడినా ఆ క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుందని అభిషేక్ కొనియాడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఆరేళ్లు గడుస్తున్నా.. ధోనీ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
US Iran Peace Deal:అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం! ముగిసిన యుద్దం! ఆయిల్ ధరలు తగ్గుతాయా?
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
Deewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
Kavya Sri Natraj: గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
Embed widget