అన్వేషించండి

Sunrisers Hyderabad Dominance: పంజాబ్ కింగ్స్‌పై ఎస్ఆర్‌హెచ్ నయా రికార్డ్.. మళ్ళీ 200 ప్లస్ స్కోరుతో ముంబై ఇండియన్స్ రికార్డ్ సమం! SRH బ్యాటర్ల ఊచకోత

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి విరుచుకుపడ్డారు. 235 పరుగుల భారీ స్కోరుతో ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును ఎస్ఆర్‌హెచ్ సమం చేసింది.

Sunrisers Hyderabad Dominance Against Punjab Kings : ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ విధ్వంసం ఆగడం లేదు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ (PBKS) కనిపిస్తే చాలు హైదరాబాద్ బ్యాటర్లు రికార్డుల వేట మొదలుపెడుతున్నారు. తాజాగా జరిగిన మ్యాచ్‌లో మరోసారి 200 ప్లస్ స్కోరు సాధించిన ఎస్ఆర్‌హెచ్.. ఐపీఎల్ చరిత్రలో ఒకే టీమ్ పై అత్యధిక సార్లు 200 పైగా పరుగులు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబైకి ఎనిమిది సార్లు ఈ ఫీట్ సాధించిన రికార్డ్ ఉండగా, ఇప్పుడు పంజాబ్ పై హైదరాబాద్ కూడా అదే మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంది.

రికార్డుల హోరు - హైదరాబాద్ జోరు..
హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. పంజాబ్ పై హైదరాబాద్ కు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. గతంలో 2025లో ఇదే వేదికపై సెకండ్ ఇన్నింగ్స్ లో 247/2 పరుగులు చేయడం విశేషం. ఇరుజ‌ట్ల మ‌ధ్య‌ టాప్ 5 స్కోర్లను గమనిస్తే అందులో నాలుగు హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. పంజాబ్ బౌలర్లు ఎవరైనా, స్టేడియం ఏదైనా ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.

టాప్ స్కోర్ల వివరాలు ఇవే:

247/2 - హైదరాబాద్ (2025)

235/4 - హైదరాబాద్ (2026)

219/6 - ముల్లన్ పూర్ (2026)

215/6 - హైదరాబాద్ (2024)

212/6 - హైదరాబాద్ (2019)

విధ్వంసం సృష్టించిన బ్యాటర్లు..
ఈ మ్యాచ్‌లో కూడా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (69), ఇషాన్ కిషన్ (55) పంజాబ్ ఫీల్డర్లు ఇచ్చిన అవకాశాలను వాడుకుని స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆఖర్లో నితీష్ కుమార్ రెడ్డి మెరుపు మెరుపులు మెరిపించడంతో స్కోరు 230 దాటింది. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు నమోదయ్యాయి. పంజాబ్ పై ఒకే మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం విశేషం.

పంజాబ్ ఫీల్డింగ్ వైఫల్యం..
మరోవైపు పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ లో చాలా తప్పిదాలు చేసింది. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 1/32 తో రాణించినప్పటికీ.. క్యాచ్‌లు డ్రాప్ చేయడం, స్టంపింగ్ మిస్ చేయడం వల్ల అతనికి వికెట్లు దక్కలేదు. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై ఫీల్డర్లు కూడా చేతులెత్తేయడంతో పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకుంది. క్లాసెన్, కిషన్ వంటి డేంజరస్ బ్యాటర్లకు లైఫ్ ఇవ్వడం పంజాబ్ భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోడానికి ప్రధాన కారణమైంది. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అంటేనే ఇప్పుడు భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ రెండు జట్ల మధ్య పోరు ఇప్పుడు ఐపీఎల్ లోనే అత్యంత ఆసక్తికరమైన బ్యాటింగ్ రైవల్రీగా మారింది. హైదరాబాద్ బ్యాటర్ల జోరు చూస్తుంటే ఈ సీజన్ లో మరిన్ని రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
MI Creates IPL Superb Record: ఐపీఎల్ చరిత్రలో MI సరికొత్త రికార్డు: బుమ్రా సారథ్యంలో అరుదైన మైలురాయి!
ఐపీఎల్ చరిత్రలో MI సరికొత్త రికార్డు: బుమ్రా సారథ్యంలో అరుదైన మైలురాయి!
CSK Sign Dian Forrester as Replacement: సీఎస్కే జట్టులో మరో మార్పు: గాయంతో జేమీ ఓవర్టన్ అవుట్.. సౌతాఫ్రికా ఆల్రౌండర్ ఎంట్రీ!
CSK జట్టులో మరో మార్పు: గాయంతో జేమీ ఓవర్టన్ అవుట్.. సౌతాఫ్రికా ఆల్రౌండర్ ఎంట్రీ!
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Shortage: ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
Bandi Bhagirath Case Latest News: బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
Radhan Pandit: 101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
Aviation Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..
విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం విమానయానంపై ఎంతటి ప్రభావం చూపుతుందంటే..
Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Bad Boy Karthik OTT : ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
Embed widget