SRH vs RR IPL 2024 Head to Head Records : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ లీగ్ దశ మ్యాచ్‌ల చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్‌లోని 50 వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రస్తుతం రెండు వరుస ఓటముల కారణంగా ప్లే ఆఫ్‌ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో అత్యుత్తమ జట్టుగా నిలిచింది. రాయల్స్ జట్టు... బ్యాటింగ్, బౌలింగ్‌లలో చాలా పటిష్టంగా ఉంది.  


హెడ్‌ టు హెడ్‌ రికార్డులు


హైదరాబాద్- రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకు మొత్తం 18సార్లు తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్‌ తొమ్మిది మ్యాచులు గెలవగా... రాజస్థాన్‌ కూడా తొమ్మిది మ్యాచులు గెలిచింది. రాజస్థాన్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 217. హైదరాబాద్‌పై రాజస్థాన్ అత్యధిక మొత్తం 220. గత ఏడాది మే 7న ఈ రెండు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 214/2 చేసింది. హైదరాబాద్‌ ఆఖరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ ఏడు బంతుల్లో 25 పరుగులు చేసి హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించింది.


పిచ్ నివేదిక
హైదరాబాద్- రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్‌ బ్యాటర్లకు స్వర్గధామంగా ఉంది. బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఇక్కడ భారీ విజయం నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేయడం మంచి ఎంపిక. బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ నెమ్మదిస్తూ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. 


జట్లు:
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్‌), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర ఖాన్ చాహల్, అవేశ్వేంద్ర ఖాన్ చాహల్, , రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.


సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతవేద్ సుబ్రమణ్యన్.