IPL 2024: ఈ సీజన్ లో వివాదాలతోనే ముంబై కెప్టెన్ గా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఛాన్స్ కోల్పోనున్నాడా.? పరిస్థితి చూస్తే అలానే ఉంది ఇప్పుడు. పాండ్యా పూర్తిగా ఫిట్ గా లేకుండానే మ్యాచ్ లు ఆడుతున్నాడని అందుకే బౌలింగ్ కు కూడా సరిగ్గా రావట్లేదని మాజీలు చేస్తున్న గోలతో టీమిండియా మేనేజ్మెంట్ ఓ డెసిషన్ తీసుకుంది. ఇకపై హార్దిక్ పాండ్యా ప్రతీ మ్యాచ్ లోనూ బౌలింగ్ చేయాలని ఇంటర్నల్ గా ఓ అల్టిమేటం జారీ చేసింది. అది నిజమే అని నిన్న మ్యాచ్ చూస్తే అర్థమవుతోంది.
మీడియా సర్కిల్స్ మాత్రమే వచ్చిన విషయాన్ని కామేంటటర్లు కూడా ప్రస్తావించారు. అంటే పాండ్యా వరల్డ్ కప్ ఆడితే అది ఆల్ రౌండర్ కోటాలో ఆడాలి. ఎంత వైస్ కెప్టెన్ అయినా అతన్ని కేవలం బ్యాటర్ గానో లేదా స్పెషలిస్ట్ బౌలర్ గానే కన్సిడర్ చేసి తీసుకునే స్పేస్ ఇప్పుడు టీమిండియా లో లేదు. కానీ పాండ్యా తన ఫామ్ లేమిని యథావిధిగా కొనసాగిస్తూ వచ్చాడు. నిన్న బ్యాటింగ్ లో పంజాబ్ మీద పది పరుగులే చేసిన పాండ్యా..బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు. ఇది పర్లేదు అనిపించినా ఆ నాలుగు ఓవర్లు వేయటానికి చాలా స్ట్రగుల్ అవుతూ కనిపించాడు.
విపరీతమైన ఆయాసంతో పిచ్ పైనే కూలబడి రెస్ట్ తీసుకుంటూ కనిపించాడు పాండ్యా. అంపైర్లు దగ్గరకి వెళ్లి పరిశీలించారు కూడా. అంటే పూర్తి ఫిట్నెస్ లేకుండానే పాండ్యా మ్యాచ్ లు ఆడేస్తున్నాడని నిన్న మ్యాచ్ చూస్తే అర్థమవుతోంది. ఈ సీజన్ లో పాండ్యా గణాంకాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. 7 మ్యాచ్ ల్లో 141పరుగులు మాత్రమే చేశాడు. అడపాదడపా బౌలింగ్ చేస్తూ 4వికెట్లు మాత్రమే తీశాడు. సో ఈ స్టాట్స్ చూసి అతన్ని వరల్డ్ కప్ కి తీసుకుంటారా లేదా రోహిత్ శర్మ కెప్టెన్ కాబట్టి తనకు జరిగిన అన్యాయం పాండ్యాకు జరగకుండా హిట్ మ్యాన్ చూసుకుంటా చూడాలి.