Rohit Sharma Unwanted Record: రోహిత్ చెత్త రికార్డు - ఐపీఎల్ చరిత్రలో అన్ వాంటెడ్ రికార్డు సమం చేసిన హిట్ మ్యాన్
రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రోహిత్ శర్మ సున్నా పరుగులకే అవుట్ కావడంతో ఐపీఎల్ లో అత్యధికంగా 19 సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు.

Rohit Sharma Registers Unwanted Record of Most Ducks in IPL: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఒక అన్‌వాంటెడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్ లో రోహిత్ శర్మ ఫోర్-బాల్ డక్‌గా అవుట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన అద్భుతమైన లెంత్ బాల్‌ను డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన రోహిత్ శర్మ, పేస్ వేగాన్ని అంచనా వేయలేక వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐపీఎల్ కెరీర్ లో రోహిత్ శర్మకు ఇది 19వ డకౌట్ కావడం గమనార్హం. ఈ ఘనతతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుట్ అయిన ఆల్-టైమ్ రికార్డులో గ్లెన్ మాక్స్‌వెల్ (19 డకౌట్లు) సరసన ఆయన చేరాడు.
Read Also: IPL 2026 RR VS MI Result Update: సన్ రైజర్స్ వర్సెస్ రాయల్స్.. ఎలిమినేటర్ పోరు ఖరారు.. ఆఖరి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చర్
అత్యధిక డకౌట్ల అన్‌వాంటెడ్ లిస్ట్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే రోహిత్ శర్మ, గ్లెన్ మాక్స్‌వెల్ చెరో 19 డకౌట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వీరి తర్వాతి స్థానాల్లో దినేష్ కార్తీక్ (18), సునీల్ నరైన్ (18), పీయూష్ చావ్లా (16) ఉన్నారు. ఈ సీజన్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆయన ఈ ఏడాది ఆడిన 9 మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీల సాయంతో కేవలం 283 పరుగులు మాత్రమే చేసి తన ఐపీఎల్ ప్రయాణాన్ని ముగించారు. ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే నిష్క్రమించడానికి టాప్ ఆర్డర్ వైఫల్యం కూడా ఒక కారణమైంది.
కేకేఆర్ భారీ స్కోరు..
ఇక రాజస్థాన్ ప్లే ఆఫ్స్ కు చేరడంతో కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ అప్రధాన్యంగా మారిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన డీసీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. సీనియర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఫిఫ్టీ (30 బంతుల్లో 60, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. శుభమ్ దూబేకు రెండు వికెట్లు దక్కాయి. ఇక ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు మే 26, మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచ్ లో (Qualifier 1) డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ధర్మశాలలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడిపోయిన జట్టుకు క్వాలిఫైయర్ 2 రూపంలో ఫైనల్ చేరడానికి మరో అవకాశం లభిస్తుంది.
బుధవారం జరగబోయే హై-స్టేక్స్ ఎలిమినేటర్ (Eliminator) మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పవర్‌ఫుల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో న్యూ చండీగఢ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుండి నేరుగా అవుట్ అవుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో అడుగుపెడుతుంది. అక్కడ ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుతో ఫైనల్ బెర్త్ కోసం న్యూ చండీగఢ్ లోనే పోటీ పడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.
Before You Go
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















