Rohit Sharma IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఇప్పుడు ముంబై ఇండియన్స్ (MI) జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట బ్యాటింగ్‌లో మరో రికార్డు నమోదైంది. ఇప్పుడు ఐపీఎల్‌లో ఏదైనా ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ మొదటి స్థానంలో నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు మైదానంలోకి వచ్చినప్పుడు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తనను తాను ప్లేయింగ్ 11లో చేర్చుకోలేదు. ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాలో తనను తాను చేర్చుకున్నాడు. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ముంబై తరుపున ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ ఇప్పుడు కోల్‌కతాపై IPLలో మొత్తం 1040 పరుగులు సాధించాడు. ఏదైనా ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన రికార్డును రోహిత్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. చెన్నై సూపర్ కింగ్స్‌పై శిఖర్ ధావన్ 1029 పరుగులు సాధించాడు.
ముంబై ఇండియన్స్, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో 51 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో మొత్తం 104 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా తరఫున సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా వెంకటేష్ నిలిచాడు. అంతకుముందు బ్రెండన్ మెకల్లమ్ 2008 సంవత్సరంలో ఆడిన మొదటి సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున సెంచరీ సాధించాడు.
ఐపీఎల్ 2023లో ముంబయి ఇండియన్స్ వరుసగా రెండో విజయం అందుకుంది. వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 186 పరుగుల టార్గెట్‌ను అత్యంత సునాయాసంగా ఛేదించేసింది. 17.4 ఓవర్లకే 5 వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (58; 25 బంతుల్లో 5x4, 5x6) మెరుపు హాఫ్ సెంచరీ బాదేశాడు. సూర్యకుమార్ యాదవ్ (43; 25 బంతుల్లో 4x4, 3x6) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అంతకు ముందు కేకేఆర్‌లో వెంకటేశ్ అయ్యర్ (104; 51 బంతుల్లో 6x4, 9x6) అమేజింగ్ సెంచరీ కొట్టేశాడు. మెక్‌కలమ్ తర్వాత కేకేఆర్‌లో సెంచరీ కొట్టిన రెండో ఆటగాడిగా అవతరించాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (21;11 బంతుల్లో 3x4, 1x6) మెరిశాడు.
'మేం కొడితే వాళ్లూ వీళ్లూ చెప్పుకోవడమే కానీ మాకూ తెలియదు' అన్నట్టుగా ఆడింది... ముంబయి ఇండియన్స్! 186 పరుగుల లక్ష్యం తమకో లెక్కే కాదన్నట్టుగా చెలరేగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (20; 13 బంతుల్లో) ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. రెండు సిక్సర్లు బాదేశాడు. మరోవైపు చిచ్చర పిడుగు ఇషాన్ కిషన్ డైనమైట్‌లా పేలాడు. డేంజరస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను ఊచకోత కోశాడు. వరుస సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికే ముంబయి 72/1తో నిలిచింది. జట్టు స్కోరు 65 వద్ద రోహిత్‌ను సుయాశ్, 83 వద్ద ఇషాన్‌ను వరుణ్ బౌల్డ్ చేశాడు.
ఓపెనర్లు ఔటయ్యాక తిలక్ వర్మ (30; 25 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి సూర్యకుమార్ దుమ్మురేపాడు. మూడో వికెట్‌కు 38 బంతుల్లో 60 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 360 డిగ్రీల బాదుడును ప్రదర్శించాడు. 13.5వ బంతికి తిలక్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ జోడీని సుయాశ్ విడగొట్టాడు. కానీ అప్పటికే చేయాల్సిన రన్‌రేట్ తగ్గిపోయింది. విజయానికి 9 పరుగులు అవసరమైనప్పుడు శార్దూల్ వేసిన 16.3వ బంతికి సూర్య పెవిలియన్ చేరాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (24; 13 బంతుల్లో 2x6) జట్టును విజయ తీరాలకు చేర్చాడు.