Royal Challengers Bangalore vs Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 39 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ తప్ప ఇంకెవరూ రాణించలేకపోయారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో చెత్త ప్రదర్శన కనబరిచారు. కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌కు దిగింది. అయితే వారికి మొదటి బంతికే భారీ షాక్ తగిలింది. ఫాంలో ఉన్న కెప్టెన్, ఓపెనర్ విరాట్ కోహ్లీను (0: 1 బంతి)మొదటి బంతికే ట్రెంట్ బౌల్ట్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ షాబాజ్ అహ్మద్‌ను (2: 4 బంతుల్లో) కూడా బౌల్ట్ తన తర్వాతి ఓవర్లోనే అవుట్ చేశాడు. దీంతో బెంగళూరు 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత నుంచి ఓపెనర్ ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 39 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మాస్ ర్యాంపేజ్ మొదలయింది. ఏ దశలోనూ రన్‌రేట్ 10కి పడిపోకుండా వీరు అద్భుతంగా ఆడారు. వీరి ధాటికి పవర్ ప్లేలో ఆర్సీబీ 62 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా వీరి జోరు తగ్గలేదు. 10 ఓవర్లకు స్కోరు 101 పరుగులకు తీసుకెళ్లారు. ఇద్దరూ అర్థ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 127 పరుగులు జోడించిన అనంతరం లేని పరుగుకు ప్రయత్నించి ఫాఫ్ డుఫ్లెసిస్ రనౌటయ్యాడు. కాసేపటికే మ్యాక్స్‌వెల్ కూడా అశ్విన్ బౌలింగ్‌లో స్విచ్ హిట్‌కు ప్రయత్నించి హోల్డర్ చేతికి చిక్కాడు. అప్పటికి స్కోరు 15 ఓవర్లలో 155 పరుగులకు చేరుకుంది.
మ్యాక్స్‌వెల్ అవుటయ్యాక ఆర్సీబీ పూర్తిగా తడబడింది. చివరి ఐదు ఓవర్లలో 33 పరుగులు మాత్రమే చేసింది. మహిపాల్ లొమ్రోర్ (8: 6 బంతుల్లో, ఒక ఫోర్), దినేష్ కార్తీక్ (16: 13 బంతుల్లో), వనిందు హసరంగ (6: 7 బంతుల్లో) వేగంగా ఆడలేకపోయారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులకు పరిమితం అయింది. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు.రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లకు చెరో వికెట్ దక్కింది.
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అబ్దుల్ బాసిత్, ఆకాష్ వశిష్ట్, డోనోవన్ ఫెరీరా, మురుగన్ అశ్విన్, కే ఎం ఆసిఫ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, ఆకాష్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్ రావత్