అన్వేషించండి

Virat Kohli Records: టీ20లో విరాట్ కోహ్లీ రికార్డ్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా అరుదైన ఘనత

MI vs RCB | ముంబై ఇండియన్స్ పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. MI జట్టుపై 1000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్ కోహ్లీనే.

ముంబై: రన్ మేషిన్ విరాట్ కోహ్లీ  IPL 2026లో రికార్డులు సృష్టిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుపై ముంబై వేదికగా ఆడుతూ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్ పై వెయ్యి పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా కోహ్లీ చరిత్రలో నిలిచాడు. ఛాంపియన్స్ లీగ్ T20, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండింటిలోనూ కలిపి ముంబై జట్టుపై కింగ్ కోహ్లీ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు.

వాంఖడే మైదానంలో ఆదివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో 20 పరుగులు చేయడంతో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ విషయంలో అతను భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లను అధిగమించాడు. ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్ ఎక్కువ దూరంలో లేరు. విరాట్ రికార్డు మాత్రం చారిత్రాత్మకమైనది. ఎందుకంటే అతను ఒకే జట్టు (RCB) తరఫున ఆడుతూ ప్రత్యర్థి జట్టుపై ఏకంగా వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ ముంబైకి వ్యతిరేకంగా వెయ్యి పరుగులు చేయడానికి కేవలం 23 పరుగుల చేరువలో ఉన్నాడు. అయితే కోహ్లీ మాత్రం ఒకే జట్టుకు ఆడుతూ ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైక క్రికెటర్.

T20లో MI జట్టుపై అత్యధిక పరుగుల వీరులు

  • 1000+ పరుగులు - విరాట్ కోహ్లీ (ఆర్సీబీ)
  • 977 పరుగులు - కేఎల్ రాహుల్
  • 888 పరుగులు - అజింక్యా రహానే
  • 850 పరుగులు - సురేష్ రైనా
  • 829 పరుగులు - MS ధోని (సీఎస్కే, ఆర్పీఎస్)

4 జట్లపై 1000 పరుగులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో విరాట్ కోహ్లీ 4 వేర్వేరు జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేశాడు. కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌పై 1174 పరుగులు చేయగా, పంజాబ్ కింగ్స్‌పై 1159 పరుగులు చేశాడు.  కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై కూడా వెయ్యికి పైగా పరుగులు చేసి సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు. 

ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ IPLలో ముంబై ఇండియన్స్‌పై 922 పరుగులు చేశాడు. ఇతర టోర్నీ్లలోనూ ముంబైపై పరుగులు చేశాడని తెలిసిందే. IPLలో ముంబైకి వ్యతిరేకంగా వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 78 పరుగులు చేయాల్సి ఉంది. IPL చరిత్రలో 8 వేలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ కోహ్లీనే. 

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
Hardik Pandya News: ముంబై వర్సెస్ బెంగళూరు ఫైట్.. సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీ! హార్దిక్ పాండ్యా ఇంజ్యూరీ అప్డేట్
ముంబై వర్సెస్ బెంగళూరు ఫైట్.. సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీ! హార్దిక్ పాండ్యా ఇంజ్యూరీ అప్డేట్
IPL 2026 GT VS RR Result Update: జీటీకి వ‌రుస‌గా నాలుగో విక్ట‌రీ.. టోర్నీలోనే అతి పెద్ద విజ‌యం.. రాణించిన గిల్, సుద‌ర్శ‌న్, ర‌షీద్, హోల్డ‌ర్, రాయ‌ల్స్ చిత్తు
జీటీకి వ‌రుస‌గా నాలుగో విక్ట‌రీ.. టోర్నీలోనే అతి పెద్ద విజ‌యం.. రాణించిన గిల్, సుద‌ర్శ‌న్, ర‌షీద్, హోల్డ‌ర్, రాయ‌ల్స్ చిత్తు
Axar Patel News: అక్షర్ పటేల్ బ్యాటింగ్ వైఫల్యం.. ఐపీఎల్ చరిత్రలో సెకండ్ లోయెస్ట్ యావరేజ్ కెప్టెన్ గా రికార్డు! 
అక్షర్ పటేల్ బ్యాటింగ్ వైఫల్యం.. ఐపీఎల్ చరిత్రలో సెకండ్ లోయెస్ట్ యావరేజ్ కెప్టెన్ గా రికార్డు! 
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల కుర్రాడు
Tamil Nadu Updates: తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Panchali Panchabhartruka: అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు... 'పాంచాలి పంచభర్తృక'పై నటకిరీటి ధీమా
అప్పటి రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు... 'పాంచాలి పంచభర్తృక'పై నటకిరీటి ధీమా
India next CDS : భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి - అజిల్ ధోవల్ మార్క్ !
భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి - అజిల్ ధోవల్ మార్క్ !
Pumpkin Seeds : ఉదయాన్నే నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే కలిగే లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం తినేయండి
ఉదయాన్నే నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే కలిగే లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం తినేయండి
Suzuki Swift Hydrogen Prototype: హైడ్రోజన్ పవర్ తో దూసుకెళ్లనున్న స్విఫ్ట్.. నితిన్ గడ్కరీ కలల కారు సిద్ధం! అదిరిపోయే పవర్, క్లీన్ ఎనర్జీ
హైడ్రోజన్ పవర్ తో దూసుకెళ్లనున్న స్విఫ్ట్.. నితిన్ గడ్కరీ కలల కారు సిద్ధం! అదిరిపోయే పవర్, క్లీన్ ఎనర్జీ
Embed widget