By: ABP Desam | Updated at : 09 May 2023 06:25 PM (IST)
గౌతమ్ గంభీర్
Gautam Gambhir:
తనను నమ్మినవారిని.. తనవాళ్లే అని భావించినవాళ్లకు సాయం చేయడంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ ముందుంటాడు. తనకు వీలైన రీతిలో సాయం చేస్తుంటాడు. ఆపదలో ఉన్నామని చిన్న సందేశం ఇచ్చినా చాలు! సహృదయతతో స్పందిస్తాడు. తనకు చేతనైన మేరకు అండదండలు అందిస్తాడు.
తాజాగా టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ శర్మ కుటుంబానికి గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. రాహుల్ అత్తమ్మ తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఆసరాగా ఉన్నాడు. ఆమెను సరైన సమయంలో మంచి ఆస్పత్రిలో చేర్చేందుకు సాయపడ్డాడు. తన పర్సనల్ అసిస్టెంట్ గౌరవ్ అరోరాతో దిల్లీ నగరంలోని అత్యుత్తమ న్యూరాలజీ వైద్యుడిని సంప్రదించేలా చేశాడు. సర్ గంగారం ఆస్పత్రిలో ఆమెకు శస్త్రచికిత్స పొందేలా చూశాడు.
Thank you @GautamGambhir paaji you r the best ❤️⭐️🫶🏻 pic.twitter.com/18591PpvcF
— Rahul Sharma (@ImRahulSharma3) May 9, 2023
గౌతమ్ గంభీర్ తనకు ఎంత సాయం చేశాడో రాహుల్ శర్మ ట్వీట్ ద్వారా వెల్లడించాడు. అతడికి కృతజ్ఞతలు తెలియజేశాడు. అతడితో పాటు సహాయకుడు గౌరవ్ అరోరా, వైద్య బృందం, ఆస్పత్రి వర్గాలకు ధన్యవాదాలు తెలిపాడు.
'చివరి నెల చాలా కష్టంగా గడిచింది. మా అత్తమ్మ బ్రెయిన్ హ్యేమరేజ్‌తో బాధపడ్డారు. క్రిటికల్ కండీషన్‌కు వెళ్లారు. ఈ విపత్కర పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్, ఆయన సహాయకుడు గౌరవ్ అరోరా మాకు అండగా నిలిచారు. బెస్ట్ న్యూరాలజిస్టు, హాస్పిటల్‌ను అతి తక్కువ సమయంలో వెతికిపెట్టారు. మా అత్తమ్మ శస్త్రచికిత్స విజయవంతమైంది. ఇప్పుడామె చాలా బాగున్నారు. మమ్మల్ని బాగా చూసుకున్న గంగారం ఆస్పత్రికి, అక్కడి స్టాఫ్‌కు ధన్యవాదాలు. డాక్టర్ మనీశ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ వైద్యం అద్భుతం' అని రాహుల్ శర్మ ట్వీట్ చేశాడు.
గౌతమ్ గంభీర్ సాయం చేయడం ఇదే మొదటి సారి కాదు! పుల్వామా దాడిలో అమరులైన సైనికుల పిల్లల చదవు సంధ్యలు, ఆహార బాధ్యతలను తీసుకున్నాడు. కొందరు అనాథలను చేరాదీశాడు. దిల్లీలో అతి తక్కువ ధరకు భోజన సదుపాయం కల్పించాడు. ఇక కొవిడ్ సమయంలో ఔషధాలు సరఫరా చేశాడు. తన సొంత డబ్బులతో అవసరమైన వారికి మందులు అందించాడు.
ఇక రాహుల్ శర్మ విషయానికి వస్తే గతంలో టీమ్‌ఇండియాకు ఆడాడు. 4 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. దేశవాళీ క్రికెట్లో మంచి అనుభవమే ఉంది. తనదైన లెగ్ స్పిన్‌తో ఆకట్టుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగులో డక్కన్ ఛార్జర్స్, దిల్లీ డేర్ డెవిల్స్, పుణెవారియర్స్‌కు ఆడాడు. వన్డేల్లో 6, టీ20ల్లో 3, ఫస్ట్‌క్లాస్‌లో 42, లిస్ట్ ఏలో 54, టీ20ల్లో 80 వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌కు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఉన్నాడు. 11 పాయింట్లతో ఆ జట్టు ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడంతో ఇబ్బంది పడుతోంది. ఈ మధ్య ఆడిన మ్యాచుల్లో ఘోర ఓటములు చవిచూసింది. ఛేదనలోనూ లక్నోకు మెరుగైన రికార్డు లేదు. ఏదేమైనా మిగిలిన మ్యాచుల్లో విజయాలు సాధించేలా చేసి ప్లేఆఫ్ చేర్చాలని గౌతీ పట్టుదలతో ఉన్నాడు.
IF GOD IS A MAN... @GautamGambhir ❤️
— S. (@pullshotx45) May 9, 2023
This is how help should be done .@GautamGambhir sir really appreciated your work
— benarasi Babu😎 (@provane_) May 9, 2023
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Byjus Loan Default: బైజూస్‌కు షాక్! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్ ఎగ్గొట్టినట్టే!