PBKS vs GT IPL 2024 Head to head records : గత ఎనిమిదేళ్లుగా కనీసం ప్లే ఆఫ్‌కు చేరిన పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌(PBKS).. మరోసారి ఆ దిశగా పయనిస్తుండడం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్‌(IPL) 2014 సీజన్‌ నుంచి నాకౌట్‌ దశకు చేరుకోలేదు. ఈ ఐపీఎల్లో ఇప్పటివరకూ ఏడు మ్యాచులు ఆడిన పంజాబ్‌ రెండు విజయాలు.. అయిదు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లోనూ పంజాబ్‌ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.
శిఖర్ ధావన్ సారథ్యంలోనూ పంజాబ్‌ ఓటమి కష్టాలు తప్పలేదు. అయితే నూతన సారధి శామ్‌ కరణ్‌ చేదు జ్ఞాపకాలను చెరిపేసి.. పంజాబ్‌ను విజయాల బాట పట్టించాలని చూస్తున్నారు. మరోవైపు మొదటి రెండు సీజన్‌లలో మంచి ప్రదర్శన చేసిన గుజరాత్‌ టైటాన్స్‌(GT) ఈ సీజన్‌లో సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే ఈ సీజన్‌లో గుజరాత్‌కు కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్లు నేడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగి అమీతుమీ తేల్చుకోనున్నాయి. కేన్ విలియమ్సన్‌ను తుది జట్టులోకి తీసుకుని గెలుపు బాట పట్టాలని గుజరాత్‌ వ్యూహం రచిస్తోంది.


హెడ్‌ టు హెడ్ రికార్డులు
  ఐపీఎల్లో ఇప్పటివరకూ గుజరాత్‌ టైటాన్స్‌-పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌ నాలుగు మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు చెరో రెండు మ్యాచులు గెలిచాయి.  ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 261 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. సాయి సుదర్శన్ 119 పరుగులతో రెండో స్థానంలో.. శిఖర్ ధావన్ 105 పరుగులతో మూడో  స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో ఏడు వికెట్లతో కగిసో రబాడ మొదటి స్థానంలో, రషీద్ ఖాన్ నాలుగు వికెట్లతో రెండో స్థానంలో, నూర్ అహ్మద్ రెండు వికెట్లతో మూడో స్థానంలో నిలిచారు.


గత మ్యాచ్‌లో ఇలా...
ఐపీఎల్ 2024లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ మూడు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. అనంతరం పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో టాప్ స్కోరర్ శశాంక్ సింగ్ (61 నాటౌట్: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) చివరి వరకు ఉండి మ్యాచ్ గెలిపించాడు. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (89 నాటౌట్: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అందరి కంటే ఎక్కువ పరుగులు చేశాడు. శశాంక్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 


గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, స్పెన్సర్ జాన్సన్, కార్తీక్ త్యాగి, జాషువా లిటిల్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, సందీప్ వారియర్, శరత్ బిఆర్, మానవ్ సుతార్. 


పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.