పిక్క కండరాల గాయం నుండి కోలుకున్నప్పటికీ, ఎంఎస్ ధోనీ లక్నో వెళ్ళే ముందు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
MS Dhoni Skips LSG Match: LSG మ్యాచ్‌కు దూరంగా ఎంఎస్ ధోనీ- సీఎస్కే అభిమానులకు నిరాశ తప్పదా?
MS Dhoni Latest News: చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ లక్నోతో జరిగే తర్వాతి మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో అభిమానులు తమ ఫేవరెట్ ప్లేయర్ ఆటను చూసేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

- ఎంఎస్ ధోనీ లక్నోతో మ్యాచ్‌కు జట్టుతో ప్రయాణించడం లేదు.
- పిక్క కండరాల గాయం నుంచి కోలుకున్నా, ధోనీ ఇంకా ఆడటం లేదు.
- ధోనీ సూచనలతో యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని తెలుస్తోంది.
- ఊర్విల్ పటేల్ రికార్డు హాఫ్ సెంచరీ ధోనీ సలహాతోనే సాధ్యమైంది.
MS Dhoni Skips Lucknow Travel As CSK Prepare For LSG Clash: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఒక చేదు వార్త అందింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం ఏకానా స్టేడియంలో జరగబోయే కీలక మ్యాచ్ కోసం ఎంఎస్ ధోనీ జట్టుతో కలిసి లక్నో వెళ్లలేదు. 44 ఏళ్ల ధోనీ ఈ సీజన్ ప్రారంభానికి ముందే కాఫ్ ఇంజరీ (పిక్క కండరాల గాయం) బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన గాయం నుండి కోలుకున్నప్పటికీ, ఇంకా మైదానంలోకి దిగలేదు. ధోనీ గైర్హాజరీలో, రాజస్థాన్ రాయల్స్ నుండి ట్రేడ్ ద్వారా వచ్చిన సంజు శామ్సన్ వికెట్ కీపింగ్ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.
ధోనీ ప్రయాణం ఎందుకు రద్దయింది?
తాజా రిపోర్ట్ ప్రకారం, ధోనీ లక్నో వెళ్లేందుకు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ, చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీనివల్ల లక్నోలో ధోనీ మెరుపులు చూద్దామనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ఆయన ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోయినా, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటూ కుర్రాళ్లకు విలువైన సూచనలు ఇస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ధోనీ పర్యవేక్షణలో యువ ఆటగాళ్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచు కుంటున్నారు. ముఖ్యంగా ఒత్తిడి సమయాల్లో ఎలా ఆడాలో ధోనీ నుంచి నేర్చుకుంటున్నామని చాలా మంది ప్లేయర్స్ చెప్తున్నారు.
Also Read: పవర్‌ప్లేలో నయా రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కగిసో రబాడ
ఊర్విల్ పటేల్ రికార్డు సృష్టించాడలా!
ఇక జట్టులోని యువ ఆటగాడు ఊర్విల్ పటేల్ రీసెంట్‌గా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ (13 బంతుల్లో) బాది రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించిన ఊర్విల్, తన సక్సెస్ వెనుక ధోనీ హస్తం ఉందని స్పష్టం చేశాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో ఊర్విల్ కేవలం 23 బంతుల్లో 65 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం మొదటి ఎనిమిది బంతుల్లోనే ఆరు సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్‌గా ఊర్విల్ చరిత్రకెక్కాడు. అంతకుముందు కొన్ని మ్యాచ్‌ల్లో త్వరగా అవుట్ అయిన ఊర్విల్, ధోనీతో మాట్లాడిన తర్వాతే తనలో క్లారిటీ వచ్చిందని తెలిపాడు.
Also Read: ఐపీఎల్ 2026 క్రేజ్.. టాప్-5 మోస్ట్ టాక్డ్ ప్లేయర్స్ లిస్ట్.. కోహ్లీ హవా మామూలుగా లేదుగా.. మిగతా ప్లేయర్లు ఎవరంటే!
ధోనీ ఇచ్చిన సలహా ఏంటి?
"నేను వరుసగా త్వరగా అవుట్ అవుతున్నప్పుడు మాహీ భాయ్ దగ్గరికి వెళ్లి అడిగాను. స్కోరును ఎలా పెంచాలి అని అడిగితే, ఆయన ఒక్కటే చెప్పారు. నీ స్కిల్ మీద నాకు ఎప్పుడూ అనుమానం లేదు, నీ మైండ్ లో ఉన్న డౌట్స్ తీసేసి క్లియర్ గా ఉండు, సరైన బంతిని సరైన చోట హిట్ చెయ్ అని సలహా ఇచ్చారు" అని ఊర్విల్ వెల్లడించాడు. ధోనీ ఇచ్చిన ఆ భరోసా వల్ల తన ఆటపై తనకు నమ్మకం పెరిగిందని, అందుకే భయం లేకుండా హిట్టింగ్ చేయగలిగానని చెప్పాడు. తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని ధోనీకి అంకితం ఇస్తున్నట్లు కూడా ఊర్విల్ పేర్కొన్నాడు. ధోనీ మైదానంలో లేకపోయినా, తన సలహాలతో చెన్నై టీమ్‌ను గెలుపు బాటలో నడిపిస్తున్నారు.
Before You Go
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Frequently Asked Questions
ఎంఎస్ ధోనీ లక్నో పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నారు?
ఎంఎస్ ధోనీ లేకపోయినా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారా?
అవును, ధోనీ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోయినా, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటూ యువ ఆటగాళ్లకు విలువైన సూచనలు ఇస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ఎవరు చేశారు?
ఊర్విల్ పటేల్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ (13 బంతుల్లో) చేసి రికార్డు సృష్టించాడు.
ఊర్విల్ పటేల్ తన సక్సెస్ వెనుక ఎవరి హస్తం ఉందని తెలిపారు?
ఊర్విల్ పటేల్ తన సక్సెస్ వెనుక ఎంఎస్ ధోనీ హస్తం ఉందని స్పష్టం చేశారు.
ఎంఎస్ ధోనీ ఊర్విల్ పటేల్‌కు ఎలాంటి సలహా ఇచ్చారు?
నీ స్కిల్ మీద నాకు ఎప్పుడూ అనుమానం లేదు, నీ మైండ్ లో ఉన్న డౌట్స్ తీసేసి క్లియర్ గా ఉండు, సరైన బంతిని సరైన చోట హిట్ చెయ్ అని ధోనీ సలహా ఇచ్చారు.
ట్రెండింగ్ వార్తలు



















