LSG vs RR IPL 2024 Head to Head Records : ఐపీఎల్‌ (IPL)44వ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్(RR) జ‌ట్టు, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(LSG) త‌ల‌ప‌డునున్నాయి. ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు బరిలోకి దిగుతున్నాయి. ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు త‌లప‌డింది త‌క్కువే అయినా టైటిల్ ఫేవ‌రెట్ల మ‌ధ్య పోరుగానే భావిస్తారు అభిమానులు. ఇక ఈ సారి రాహుల్ సార‌థ్యంలోని ల‌క్నో ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు పోరాడుతుంటే.. సంజూశాంస‌న్ నేతృత్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వరుస విజయాలతో దూకుడు మీదుంది. రాజస్థాన్‌కు ఈ సారి ఎలాగైా క‌ప్ అందివ్వాల‌ని శాంసన్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. 2022లో మిస్ అయ్యిన అవ‌కాశాన్ని ఈ సారి వ‌దులుకోకూడ‌ద‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఈ రెండు టీమ్‌ల మ‌ధ్య ఐపీయ‌ల్ లో గ‌ణాంకాలు ఎలా ఉన్నాయి ఎవ‌రికి ఎక్కువ అకాశాలున్నాయో చూద్దాం...


ఈ మ్యాచ్ గుర్తుందా
2022లో ఈ రెండు జట్ల మధ్య ముంబ‌ైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన  మ్యాచ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ 6 వికెట్లు కోల్పోయి 165 ప‌రుగులు చేసింది. షిమ్రన్ హెట్‌మేయ‌ర్ 59 ప‌రుగుల‌తో టాప్‌స్కోర‌ర్‌గా నిలిచారు. బ్యాటింగ్‌కి అనుకూలించే పిచ్ పైన ఈ లక్ష్యం స‌రిపోదు అనుకున్నారు అంతా. కానీ య‌జువేంద్ర చాహ‌ల్ స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు తీసాడు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీసాడు. దీంతో ల‌క్నో 3 ప‌రుగుల‌తో పోరాడి ఓడిపోయింది. ఇలాంటి ఉత్కంఠ‌భ‌రితంగానే ఉంటుంది ఇద్దరి మ‌ధ్య మ్యాచ్‌. అందుకే ఫ్యాన్స్ కూడా వీళ్ల మ‌ధ్య పోరు అంటే యుద్ధ‌మే అనుకొంటుంటారు.


రికార్డ్స్  ఏంటి
ఇక ఐపీఎల్‌లో ఈ రెండు టీమ్‌ల మ‌ధ్య 4 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 3 మ్యాచ్‌లు గెల‌వ‌గా, ల‌క్నో ఒక మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. 


ఈ ఆట‌గాళ్ల పోరు చూడాల్సిందే
ఇక రెండు టీమ్‌ల్లో ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు ఎలా ఉండ‌నుంది అంటే...ల‌క్నో విధ్వంస ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ వ‌ర్సెస్ సందీప్ శ‌ర్మ గా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ప‌వ‌ర్ ప్లేలో వీళ్లిద్దరి మ‌ధ్య ఆస‌క్తిక‌ర స‌మ‌రం ఉండ‌నుంది. త‌ర్వాత మిడిల్ ఆర్డర్‌లో  కేయ‌ల్ రాహుల్ కి చాహ‌ల్, అశ్విన్ ల మ‌ధ్య పోరు ఉంటుంది. మిడిలార్డర్ లో ఇది మ‌రో ఆస‌క్తిక‌ర అంశం గా చెప్పొచ్చు. రాహుల్ స్పిన్ బౌలింగ్ ని బాగా ఆడ‌గ‌ల‌డు. కానీ వీళ్లిద్దరూ రాహుల్ కి స‌వాల్ విస‌ర‌గ‌ల‌రు. ఇక భీక‌ర ఫాంలో ఉన్న య‌శ‌స్వి జెశ్వాల్ కి మార్కస్ స్టొయిన‌స్ అడ్డుగా నిల‌బ‌డ‌బోతున్నాడు. ఈ ఆట‌గాళ్ల పోరు అభిమానుల‌కు క‌నువిందు చేయ‌నుంది. అలాగే ఈ ఆట‌గాళ్ల ప్రద‌ర్శన బట్టి జ‌ట్టు విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. ల‌క్నో,రాజ‌స్థాన్ జ‌ట్లు త‌ల‌ప‌డింది త‌క్కువ మ్యాచ్‌లే అయినా వీరి మ‌ధ్య పోరు చివ‌రి బాల్ వ‌ర‌కు వెళ్తుంది. ఓట‌మిని అంత తేలిగ్గా ఒప్పుకోరు. కాబ‌ట్టి ఈ మ్యాచ్‌కోసం అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. మ‌రి రాజ‌స్‌థాన్‌, ల‌క్నోజ‌ట్లు త‌మ మొద‌టిమ్యాచ్‌లో గెలిచి ఎవ‌రు టోర్న‌మెంట్‌లో ముంద‌డుగు వేస్తారో మ‌రికాసేపట్లోతేలిపోనుంది.