LSG vs KKR IPL 2024 Head to head records: ఐపీఎల్ (IPL) 2024లో ఇవాళ రాత్రి జరిగే 54వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR),  లక్నో సూపర్ జెయింట్స్‌(LSG) తలపడనున్నాయి. లక్నోలోని ఎకానా వాజ్‌పేయి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. కోల్‌కత్తా మొత్తం పది మ్యాచ్‌లలో ఏడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు లక్నో గత పది మ్యాచ్‌ల్లో అరు మ్యాచుల్లో గెలిచి నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 


హెడ్-టు-హెడ్ రికార్డ్స్‌
కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ నాలుగు మ్యాచుల్లో లక్నో మూడు మ్యాచుల్లో విజయం సాధించగా... లక్నో ఈ సీజన్‌లోనే తొలి విజయం సాధించింది. 2023లో ఈ రెండు జట్లు మద్య జరిగిన మ్యాచులో లక్నో కేవలం ఒక పరుగు తేడాతో గెలిచింది. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో  తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ 45 పరుగులు, కెప్టెన్‌ కె.ఎల్‌ రాహుల్‌ 39  పరుగులతో రాణించడంతో లక్నో 161 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా లక్నోలో మరే బ్యాటర్‌ కూడా 30 పరుగుల మార్క్‌ను దాటలేదు. అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా సాల్ట్‌ విజృంభణతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఫిల్‌ సాల్ట్‌ 47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఒంటి చేత్తో కోల్‌కత్తాకు విజయాన్ని అందించాడు. అయ్యర్‌ కూడా 38 పరుగులతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో కోల్‌కత్తా మరో 26 బంతులు ఉండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


పిచ్‌ ఎలా ఉంటుందంటే..?
లక్నోలోని ఏకానా వాజ్‌పేయి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇక్కడ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు 213/4. చెన్నైపై లక్నో ఈ స్కోరు చేసింది. పిచ్‌ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. మ్యాచ్‌ గడుస్తున్నా కొద్దీ బౌలర్లకు కూడా సహకరిస్తుంది. రెండో  ఇన్నింగ్స్‌లో మంచు కురిస్తే బౌలర్లకు ఇబ్బందే.
దృష్టంతా వారిపైనే కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఎక్కువగా సునీల్‌ నరైన్, ఆండ్రీ రస్సెల్‌లపైనే ఎక్కువ ఆధారపడుతోంది. నరైన్‌, రస్సెల్‌ దూకుడుతో గత మ్యాచుల్లో కోల్‌కత్తా 200కుపైగా స్కోరు సాధించింది.  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై భారీ స్కోరుపై కన్నేశాడు. 


కోల్‌కత్తా లెవన్‌( అంచనా): సాల్ట్ , సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్: అనుకుల్ రాయ్.


లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, అర్షద్ ఖాన్. ఇంపాక్ట్ ప్లేయర్: ఎం సిద్దార్