అన్వేషించండి

Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు

లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. చెపాక్ స్టేడియంలో ఇదే అత్యంత వేగవంతమైన ఐపీఎల్ అర్థశతకం కావడం విశేషం.

Josh Inglis Smashes Fastest Fifty at Chepauk Stadium: చెన్నైలోని చెపాక్ స్టేడియం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుందని పేరు. కానీ ఆదివారం జరిగిన మ్యాచ్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ తన పవర్ ఫుల్ హిట్టింగ్ తో స్టేడియం నలుమూలల సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. లక్నో జట్టు ఈ మ్యాచ్ లో కీలక మార్పు చేస్తూ ఇంగ్లిస్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ నిర్ణయం సరైనదే అని ఇంగ్లిస్ తన బ్యాటింగ్ తో నిరూపించాడు. కేవలం 17 బంతుల్లోనే 50 పరుగుల మార్కును చేరుకుని ఐపీఎల్ చరిత్రలో చెపాక్ స్టేడియం వేదికగా అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదిన ఘనతను తన సొంతం చేసుకున్నాడు.

చరిత్ర తిరగరాసిన ఇంగ్లిస్..
గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సామ్ బిల్లింగ్స్ 2018లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 21 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నేళ్లుగా ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. అయితే జోష్ ఇంగ్లిస్ మాత్రం ఆదివారం లక్నో ఇన్నింగ్స్ లో విధ్వంసం సృష్టించి ఆ రికార్డును తుడిచిపెట్టేశాడు. కేవలం 17 బంతుల్లోనే మైలురాయిని చేరుకోవడమే కాకుండా, తన ఇన్నింగ్స్ ఆద్యంతం చెన్నై బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 85 పరుగులు చేసిన తర్వాత జేమీ ఓవర్టన్ బౌలింగ్ లో వెనుదిరిగినా, అప్పటికే లక్నోకు కావాల్సిన పటిష్టమైన పునాదిని అందించాడు.

రుతురాజ్ వ్యూహం ఫలించలేదా?
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పై కవర్లు ఉండటం, వర్షం సూచనలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అయితే డే మ్యాచుల్లో పిచ్ ప్రవర్తన భిన్నంగా ఉంటుందని, త్వరగా పరిస్థితులకు అలవాటు పడటం ముఖ్యమని రుతురాజ్ పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం చాలా పాజిటివ్ గా ఉందని, మొదటి మూడు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత వరుసగా పుంజుకోవడం జట్టులోని అందరిలో కాన్ఫిడెన్స్ నింపిందని చెప్పాడు. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న సీఎస్‌కే, తమ విన్నింగ్ కాంబినేషన్ ను మార్చకుండా అదే టీమ్ తో బరిలోకి దిగింది.

లక్నో ఆశలు సజీవం..
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కు ఈ మ్యాచ్ లో గెలుపు చాలా కీలకం. ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు అవుట్ అయినప్పటికీ, పరువు కోసమైనా గెలవాలని పట్టుదలతో ఉంది. జోష్ ఇంగ్లిస్ లాంటి విధ్వంసకర బ్యాటర్ ను తుది జట్టులోకి తీసుకోవడం ఆ టీమ్ కు బాగా కలిసి వచ్చింది. 33 బంతుల్లోనే 85 పరుగులు రాబట్టి ఇంగ్లిస్ తన సెలక్షన్ ను జస్టిఫై చేసుకున్నాడు. ఒకవైపు చెన్నై బౌలర్లు కట్టడి చేయాలని చూసినా, ఇంగ్లిస్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా తన నేచురల్ గేమ్ ఆడాడు.

ల‌క్నో భారీ స్కోరు..

మ‌రోవైపు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ల‌క్నో.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 203 ప‌రుగులు చేసింది. జోష్ ఇంగ్లీస్ (33 బంతుల్లో 85, 10 ఫోర్లు, 6 సిక్సర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. అతడు మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో అనుకున్న దానికంటే త‌క్కువ స్కోరుకే ప‌రిమిత‌మైంది. ఓ ద‌శ‌లో 147-6తో నిలిచిన ల‌క్నోను షాబాజ్ అహ్మ‌ద్ (25 బంతుల్లో 43 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హిమ్మ‌త్ సింగ్ (17) ఆదుకున్నారు. ఏడో వికెట్ కు సరిగ్గా 50 ప‌రుగులు జోడించి, ల‌క్నోకు భారీ స్కోరు అందించారు. మ‌రోవైపు బౌల‌ర్ల‌లో జేమీ ఓవ‌ర్ట‌న్ మూడు వికెట్ల‌తో రాణించాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manav Suthar Test Debut: అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
India T20I & Asian Games Squads: టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
Virat Kohli Ruled Out: ఆఫ్గాన్ తో  సిరీస్ కు కోహ్లీ దూరం?: గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్.. రోహిత్ పై కూడా వీడని సస్పెన్స్.. 
ఆఫ్గాన్ తో  సిరీస్ కు కోహ్లీ దూరం?: గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్.. రోహిత్ పై కూడా వీడని సస్పెన్స్.. 
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Embed widget