IPL Auction 2023 Kane Williamson Ben Stokes: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 వేలం డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో జరుగుతుంది. ఈసారి వేలం సమయంలో ఫ్రాంచైజీ చాలా మంది ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. IPL 2023 కోసం చాలా జట్లు కొత్త కెప్టెన్ల కోసం వెతుకుతున్నాయి.


ఐపీఎల్ 16వ ఎడిషన్ కోసం 403 మంది ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ అయ్యారు. వీరిలో కొందరు ఆటగాళ్లు తమ జాతీయ జట్లకు కెప్టెన్లుగా కూడా అయ్యారు. అందుకే ఐపీఎల్‌లో కెప్టెన్సీ కూడా దక్కించుకునే అవకాశం కూడా ఉంది. ఈ జాబితాలో బెన్ స్టోక్స్, కేన్ విలియమ్సన్, జేసన్ హోల్డర్ ఉన్నారు.


బెన్ స్టోక్స్ (ప్రాథమిక ధర - రూ. 2 కోట్లు)
బెన్ స్టోక్స్ ఐపీఎల్ చివరి సీజన్‌లో పాల్గొనలేదు. అయితే ఈసారి అందుబాటులోకి రానున్నాడె. ఐపీఎల్ వేలం 2023లో స్టోక్స్ బేస్ ధర రూ.2 కోట్లుగా ఉంది. అయితే దీని కంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. జో రూట్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన తర్వాత అతను ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. స్టోక్స్ కెప్టెన్సీలో జట్టు కూడా సమర్థవంతంగా ఆడింది. ఈసారి జట్లను పరిశీలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కోసం వెతుకుతున్నాయి. కాబట్టి ఈ జట్లు స్టోక్స్‌పై కన్ను వేయవచ్చు.


కేన్ విలియమ్సన్ (ప్రాథమిక ధర - రూ. 2 కోట్లు)
న్యూజిలాండ్‌ దిగ్గజం కేన్‌ విలియమ్సన్‌కు ఈ ఏడాది కష్టాలు తప్పలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చివరి సీజన్‌లో ఆయన ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. కెప్టెన్సీతో పాటు ఆటతీరుతోనూ తనదైన ముద్ర వేయలేకపోయాడు. నవంబర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కేన్‌ను రిలీజ్ చేశారు. కానీ అతను తన జాతీయ జట్టు కోసం మంచి ప్రదర్శన చేశాడు. అతని కెప్టెన్సీలో న్యూజిలాండ్ ఈసారి టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. కాబట్టి చెన్నై లాంటి జట్టు ఇతని కోసం బిడ్ చేసే అవకాశం ఉంది. ఎంఎస్ ధోనికి ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశం ఉంది.


జేసన్ హోల్డర్ (ప్రాథమిక ధర - రూ. 2 కోట్లు)
వెస్టిండీస్‌కు చెందిన ప్రతిభావంతుడైన ఆటగాడు జేసన్ హోల్డర్ తన జట్టు కోసం చాలా సందర్భాలలో బలమైన ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అద్భుతాలు చేశాడు. అతనికి 2015 సంవత్సరంలో వెస్టిండీస్ జట్టుకు వన్డే కెప్టెన్సీ ఇచ్చారు. IPL 2022లో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 8.75 కోట్లకు అతన్ని కొనుగోలు చేసింది. అయితే ఈసారి కెప్టెన్‌గా కనిపించవచ్చు.