అన్వేషించండి

IPL 2026 Unlucky Players: ఐపీఎల్‌ 2026లో అన్‌లక్కీ స్టార్లు! కోట్లు పోసికొన్నారు, ఒక్క మ్యాచ్‌తో సరిపెట్టారు!

ఐపీఎల్‌ 2026లో భారీ ధర పలికినప్పటికీ, కేవలంం ఒక్క మ్యాచ్‌తోనే బెంచ్‌కు పరిమితమైన ఆటగాళ్ల కథ ఇది. టాలెంట్ ఉన్నా టీమ్ కాంబినేషన్ పేరుతో అన్యాయానికి గురైన ఆ అన్‌లక్కీ క్రికెటర్ల వివరాలు ఇవే!

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొన్ని ఐపీఎల్ జట్లు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదు.
  • కుమార్ కుషాగ్ర, యశ్ ఠాకూర్, తేజస్వి దహియాలు తక్కువ అవకాశాలతో నిరాశ చెందారు.
  • జట్టు సమతూకం, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అవకాశాలను పరిమితం చేస్తున్నాయి.
  • తక్షణ విజయం కోసం చూస్తూ యువతరం ప్రతిభను ఫ్రాంచైజీలు విస్మరిస్తున్నాయి.

 IPL 2026 Unlucky Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ప్రతిభకు పట్టాభిషేకం. ఎక్కడో గల్లీలో ఆడే కుర్రాడు రాత్రికి రాత్రే ప్రపంచ స్థాయి స్టార్‌గా మారే అద్భుత వేదిక ఇది. ఇదే నాణేనికి మరోవైపు కూడా ఉంది. వేలంలో కోట్ల రూపాయలు వెచ్చించి, అట్టహాసంగా జట్టులోకి తీసుకున్న ఆటగాళ్లను కనీసం పరీక్షించే తీరక కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు ఉండటం లేదు. 2026 సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసే సత్తా ఉన్నా, కేవలం ఒక్కటంటే ఒక్క అవకాశం ఇచ్చి ఆ తర్వాత బెంచ్‌కే పరిమితం చేసిన నలుగురు అన్‌లక్కీ ఆటగాళ్లు కథ ఇది. 

కుమార్‌ కుషాగ్ర(గుజరాత్‌ టైటాన్స్‌)

గుజరాత్‌ టైటాన్స్ జట్టు ఈ సీజన్‌లో అదరగొట్టింది. ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఇందులో క్వాలిఫెయర్ 1లో ఆర్సీబీతో ఓడిపోయింది. కానీ ఈ జట్టులో ఒక యువ కెరటం మాత్రం అన్యాయానికి గురైంది. ఆ పేరే కుమార్‌ కుషాగ్ర. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యా్‌లో కుషాగ్రకు అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో కుషాగ్ర ఓపెన‌గా బరిలోకి దిగాడు. సాయి సుదర్శన్‌తో కలిసి తొలి వికెట్‌కు 78 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 14 బంతుల్లోనే 18 పరుగులు చేసి జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లో కూడా అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదు. కేవలం ఒక్క ఇన్నింగ్స్‌తో ఒక ఆటగాడి ప్రతిభను ఎలా అంచనా వేస్తారో మేనేజ్‌మెంట్‌కే తెలియాలి. 

యశ్‌ ఠాకూర్‌(పంజాబ్ కింగ్స్)

పంజాబ్‌ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో బౌలింగ్‌ విభాగంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. ప్రత్యర్థి జట్లు భారీ స్కోర్లు చేస్తున్నా, వికెట్లు తీయడంలో పంజాబ్ బౌలర్లు విఫలమయ్యారు. ఇలాంటి తరుణంలో ఒక యువ పేసరర్ తన స్తా చాటినప్పటికీ అతనికి మొండిచేయి ఎదురైంది. మే 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యశ్‌ ఠాకూర్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో యశ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వికెట్లు తీసి జట్టుకు ఆసరాగా నిలిచినా, తర్వాతి మ్యాచ్‌ నుంచి అతన్ని పక్కన పెట్టేశారు. 

తేజస్వి దహియా(కేకేఆర్)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మినీ వేలంలో రూ. 3 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి వికెట్ కీపర్‌ బ్యాటర్‌ తెజస్వి దహియాను కొనుగోలు చేసింది. ఇంత భారీ ధర పెట్టినప్పుడు సహజంగానే అతను కీలక ఆటగాడని భావిస్తారు. కానీ పరిస్థితి దీనికి బిన్నంగా ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇచ్చారు. అయితే ఒత్తిడిలో 12 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైన అతన్ని బెంచ్‌కు పరిమితం చేశారు. 

ఎందుకు ఇలా జరుగుతుంది?

ఐపీఎల్‌ జట్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. జట్టు సమతూకం దెబ్బతింటుందని సాకుతో ఒక మ్యాచ్‌లో బాగా ఆడిన వారిని కూడా పక్కన పెడుతున్నారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన వల్ల జట్లు అదనపు బ్యాటర్‌ లేదా బౌలర్‌ను వాడుకుంటున్నాయి. ఇది యువ ఆటగాళ్లకు దక్కాల్సిన పూర్తి స్థాయి అవకాశాలు హరిస్తోంది. ఫ్రాంచైజీలు దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణం విజయం కోసం చూస్తున్నాయి. దీంతో ఒక్క తప్పు చేసినా ఆటగాడిని పక్కన పెట్టేస్తున్నారు. 

గతంలో ఐపీఎల్‌ ద్వారా సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు వెలుగులోకి రావడానికి కారణం వారి ఫ్రాంచైజీలు వారికి ఇచ్చిన వరుస అవకాశాలే. కానీ గత కొన్ని సీజన్స్‌లో యువ ఆటగాళ్లను తీసుకోవడం వారికి ఒకట్రెండు అవకాశాలు మాత్రమే ఇచ్చి బెంచ్‌లకు పరిమితం చేయడంతో వారి ప్రతిభ ఎందుకూ పనికిరాకుండా పోతుంది.

Frequently Asked Questions

ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఎందుకు పరిమితంగా లభిస్తున్నాయి?

జట్టు సమతూకం దెబ్బతింటుందనే కారణంతో, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల, మరియు తక్షణ విజయాల కోసం చూసే ఫ్రాంచైజీల విధానం వల్ల యువ ఆటగాళ్లకు పూర్తి స్థాయి అవకాశాలు దక్కడం లేదు.

కుమార్ కుషాగ్రకు గుజరాత్ టైటాన్స్ తరపున ఎన్ని మ్యాచ్ లు ఆడించారు?

కుమార్ కుషాగ్రకు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్ లో అవకాశం ఇచ్చారు. ఆ మ్యాచ్ లో అతను ఓపెనర్ గా ఆడి 78 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు.

పంజాబ్ కింగ్స్ జట్టు యశ్ ఠాకూర్ కు ఎందుకు మరో అవకాశం ఇవ్వలేదు?

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో యశ్ ఠాకూర్ రెండు కీలక వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, తదుపరి మ్యాచ్ లలో అతనికి అవకాశం ఇవ్వలేదు.

కేకేఆర్ జట్టు తేజస్వి దహియాను ఎందుకు కేవలం ఒక మ్యాచ్ కే పరిమితం చేసింది?

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒత్తిడిలో 11 పరుగులు చేసి ఔట్ అవ్వడంతో, ఒక్క మ్యాచ్ లో విఫలమైన అతన్ని బెంచ్ కే పరిమితం చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

India T20I & Asian Games Squads: టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్  ఎంపిక‌కు బీసీసీఐ ముహూర్తం: అంద‌రి ఫోక‌స్ శ్రేయస్, వైభవ్ సూర్యవంశీ పైనే..!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
Virat Kohli Ruled Out: ఆఫ్గాన్ తో  సిరీస్ కు కోహ్లీ దూరం?: గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్.. రోహిత్ పై కూడా వీడని సస్పెన్స్.. 
ఆఫ్గాన్ తో  సిరీస్ కు కోహ్లీ దూరం?: గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్.. రోహిత్ పై కూడా వీడని సస్పెన్స్.. 
Lalit Modi Interview:
"నేను, మోదీ చాలా క్లోజ్‌, త్వరలోనే భారత్‌ వస్తాను" లలిత్ మోడీ కీలక స్టేట్మెంట్
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget