Shubman Gill Returns: గుజరాత్ కెప్టెన్ గిల్ ఫిట్.. ఢిల్లీతో పోరుకు సై..
ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాక పెద్ద బలాన్నిచ్చింది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే పోరులో ఆయన ఆడనున్నట్లు టీమ్ వర్గాలు ధృవీకరించాయి.

IPL 2026 Shubman Gill News: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు బోణీ కొట్టని గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఒక భారీ శుభవార్త దక్కింది. ఆ జట్టు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యం నుండి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చాడు. బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా (అరుణ్ జైట్లీ స్టేడియం) వేదికగా హోస్ట్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని గిల్ ఓపెనింగ్ పార్ట్నర్ సాయి సుదర్శన్ స్వయంగా ధృవీకరించాడు. "శుభ్‌మన్ ఇప్పుడు చాలా బాగున్నాడు, రేపటి మ్యాచ్‌లో ఆయన ఖచ్చితంగా ఆడతాడు" అని సాయి పేర్కొన్నాడు.
మెడ కండరాల నొప్పితో..
మెడ కండరాల నొప్పితో (Muscle Spasm) గిల్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆయన లేకపోవడంతో రషీద్ ఖాన్ జట్టును నడిపించాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో 211 పరుగుల భారీ లక్ష్య చేధనలో గుజరాత్ కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన గుజరాత్, ఇప్పుడు గిల్ రాకతో మళ్ళీ విన్నింగ్ ట్రాక్‌లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. గిల్ బ్యాటింగ్‌లో స్థిరత్వం ఇవ్వడమే కాకుండా, కెప్టెన్‌గా తన తెలివైన నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపించగలడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
🚨 Good news for Gujarat Titans 🚨
— News-Penny-Press (@News_PennyPress) April 7, 2026
Shubman Gill has recovered from a muscle spasm and is set to return against Delhi Capitals.#ShubmanGill #DCvsGT #IPL2026 pic.twitter.com/UjMNZkm6wc
గిల్ రాకతో..
గిల్ రాకపై ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ ఆసక్తికరంగా స్పందించాడు. "శుభ్‌మన్ గిల్ చాలా పెద్ద ఆటగాడు. ఆయన తన జట్టుకు కెప్టెన్ కూడా. గిల్ లాంటి ప్లేయర్ ఆడటం లేదంటే ప్రత్యర్థి బౌలర్లకు అది ఒక రకమైన ఊరట అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ రావడంతో ఆయా బౌలర్లకు సవాలుతో కూడుకున్నదే" అని మునాఫ్ పేర్కొన్నాడు. గిల్ గ్రౌండ్ లో ఉంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎంతో ఫ్రీగా ఆడే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు
వాతావరణం సహకరిస్తుందా?
ఢిల్లీలో మ్యాచ్‌కు ఒక రోజు ముందు వర్షం కురిసినప్పటికీ, బుధవారం నాటికి వాతావరణం అనుకూలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో లాగా వర్షం అంతరాయం కలిగించకపోవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ సాధారణంగా టోర్నీ ఆరంభంలోనే దూకుడు ప్రదర్శిస్తుంది. కానీ ఈసారి రెండు ఓటములతో కాస్త వెనుకబడింది. ఇప్పుడు గిల్ నేతృత్వంలో ఢిల్లీని వారి సొంత గడ్డపైనే ఢీకొట్టడానికి టైటాన్స్ సిద్ధమైంది. అటు ఢిల్లీ కూడా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈ యంగ్ కెప్టెన్ల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. మరోవైపు ఈ సీజన్ లో ఢిల్లీ మంచి జోరు మీద ఉంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలుపొంది, పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
ట్రెండింగ్ వార్తలు
















