IPL 2026 RR VS LSG Result Update: వైభవ్ సిక్సర్ల సునామీ.. రాజస్థాన్ ఈజీ విక్టరీ.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం.. రాణించిన జురేల్, జైస్వాల్,
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ కంఫర్టబుల్ విక్టరీని సాధించింది. ముఖ్యంగా వైభవ్ సిక్సర్ల జాతరతో చెలరేగడంతో భారీ టార్గెట్ ను ఈజీగా ఛేజ్ చేసింది.

IPL 2026 RR VS LSG Latest Update: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మాజీ చాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపింది. సొంతగడ్డపై జరిగిన లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. మంగళవారం జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిషెల్ మార్ష్ (57 బంతుల్లో 96, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. యశ్ రాజ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఛేజింగ్ లో చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీ (38 బంతుల్లో 93, 7 ఫోర్లు, 10 సిక్సర్లు) తో త్రుటిలో శతకాన్ని మిస్ చేసుకున్నాడు. ఓవరాల్ గా 19.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 225 పరుగులు చేసి, సక్సెస్ ఫుల్ చేజ్ ను నమోదు చేసింది. బౌలర్లలో ఆకాశ్ సింగ్, మోహ్సిన్ ఖాన్ లకు చెరో వికెట్ దక్కింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆఖరి మ్యాచ్ గెలిస్తే, ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా, ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. ఇక బుధవారం జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. నాకౌట్ రేసులో నిలవాలంటే కేకేఆర్ కు ఈ మ్యాచ్ లో గెలుపు తప్పనిసరి.
𝗦𝘁𝗼𝗿𝗺 𝗼𝗳 𝗦𝗶𝘅𝗲𝘀 🚀
— IndianPremierLeague (@IPL) May 19, 2026
Vaibhav Sooryavanshi lit up #RR's chase with a thunderous 93(38) 🎇
Updates ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG | @rajasthanroyals pic.twitter.com/qe6TfmGnTx
ఆరంభంలో ఆచితూచి..
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఓపెనర్ కమ్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ (23 బంతుల్లో 43, 8 ఫోర్లు, 1 సిక్సర్) , వైభవ్ శుభారంభాన్నిచ్చారు. కెప్టెన్సీ భారం లేకుండా యశస్వి ధాటిగా ఆడి ఫోర్లతో రెచ్చిపోయాడు. అలాగే మంచి పుల్ షాట్ తో కళ్లు చెదిరే సిక్సర్ నమోదు చేశాడు. మరోవైపు తన సహజ శైలికి విరుద్ధంగా ఆరంభంలో నెమ్మదిగా ఆడిన వైభవ్.. ఆ తర్వాత రెచ్చిపోయాడు. వీరిద్దరూ సత్తా చాటడంతో పవర్ ప్లేలో 71 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన కాసేపటికే జైస్వాల్ ఔట్ కావడంతో ఫస్ట్ వికెట్ కు నమోదైన 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
వైభవ్ సిక్సర్లతో రచ్చ..
తొలి పది బంతులు నెమ్మదిగా ఆడిన వైభవ్.. ఆ తర్వాత రెచ్చిపోయాడు. ముఖ్యంగా ధ్రువ్ జురేల్ (38 బంతుల్లో 53 నాటౌట్, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తో కలిసి జట్టును ముందుండి నడిపించాడు. ఈక్రమంలో 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన వైభవ్.. ఆ తర్వాత వేగంగా సెంచరీ వైపు దూసుకుపోయాడు. ఓవరాల్ గా పది సిక్సర్లు కొట్టిన వైభవ్ ను మోహ్సిన్ ఖాన్ బోల్తా కొట్టించడంతో ఏడు పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్-జురేల్ రెండో వికెట్ కు 105 పరుగులు జోడించారు. వైభవ్ ఔటైన తర్వాత సమయోచితంగా ఆడిన జురేల్.. చివరి కంటా నిలిచి, జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈక్రమంలో 37 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మధ్యలోప్రెటోరియస్ (7) విఫలమైనా, డోనోవాన్ ఫెరీరా (16 నాటౌట్) సత్తా చాటాడు. ఇక హ్యాట్రిక్ పరాజయాల తర్వాత రాయల్స్ కు దక్కిన విజయం ఇదే కావడం విశేషం. ఇక ముంబైతో ఆదివారం జరిగే మ్యాచ్ లో గెలిస్తే, ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నాకౌట్ కు అర్హత సాధిస్తుంది. మెరుపు ఫిఫ్టీ చేసిన వైభవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Before You Go
Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















