అన్వేషించండి

IPL 2026 MI VS RCB Latest Update: సాల్ట్ విధ్వంసం.. ఆర్సీబీ భారీ స్కోరు.. స‌త్తా చాటిన కోహ్లీ, ప‌టిదార్, డేవిడ్

MI VS RCB: బ్యాట‌ర్లు సత్తా చాట‌డంతో ముంబైపై ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. సాల్ట్, కోహ్లీ, ప‌టిదార్ అర్థ సెంచ‌రీల‌తో స‌త్తా చాటారు. 

IPL 2026  MI VS RCB Update: ఐపీఎల్ 2026 సీజ‌న్ లో చిరకాల ప్ర‌త్య‌ర్థి ముంబై ఇండియ‌న్స్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో మంచి బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చింది. వాంఖ‌డేలో శ‌నివారం జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 240 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ సూప‌ర్బ్ అర్ధ సెంచ‌రీ (36 బంతుల్లో 78, 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీసి, మిగ‌తావారితో పోలిస్తే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లోనూ స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా వికెట్ తీయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. 

పవర్ ప్లేలో బాదుడు..
టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఓపెనర్లు సాల్ట్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 50, 5 ఫోర్లు, 1 సిక్స‌ర్) శుభారంభాన్నిచ్చారు. ఆరంభ ఓవ‌ర్ల‌లో కాస్త నెమ్మ‌దిగా ఆడిన‌ట్లు క‌నిపించిన సాల్ట్.. మూడో ఓవ‌ర్లో క‌ళ్లు చెదిరే సిక్స‌ర్ కొట్టాడు. ఇక ఐదో ఓవ‌ర్ల‌లో మూడు  సిక్స‌ర్ల‌తో 22 ప‌రుగులు పిండుకున్నాడు.  ఆ త‌ర్వాత మాయాంక్ మార్కండే ఓవ‌ర్లో సిక్స‌ర్ తో 25 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు సాల్ట్. ఆ త‌ర్వాత మ‌రో రెండు ఫోర్లు హ్యాట్రిక్ న‌మోదు చేసి, సిక్స‌ర్ తో ఘ‌నంగా ముగింపునిచ్చాడు. దీంతో ఈ ఓవ‌ర్లో 20 ప‌రుగుల‌ను రాబ‌ట్టాడు. ఆ త‌ర్వాత ఏమాత్రం జోరు త‌గ్గ‌ని సాల్ట్ బౌండ‌రీలతో విరుచుకు ప‌డ్డాడు. అప్ప‌టికే ప‌వ‌ర్ ప్లేలో 71 ప‌రుగుల‌ను రాబ‌ట్టింది. ఇక 12వ ఓవ‌ర్ వేసిన లార్డ్ శార్దూల్ ఠాకూర్.. సాల్ట్ ను ఔట్ చేసి, ముంబైకి బ్రేక్ ఇచ్చాడు. దీంతో 120 ప‌రుగుల భాగస్వామ్యానికి తెర‌ప‌డింది. 

ప‌టిదార్ పంజా..
వ‌న్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ ర‌జ‌త్ ప‌టిదార్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (20 బంతుల్లో 53, 4 ఫోర్లు, 5 సిక్స‌ర్) తో బీస్ట్ మోడ్ లో ఆడాడు. ఆరంభం నుంచే బౌల‌ర్ల‌పైకి ఎదురుదాడికి దిగాడు. బౌండ‌రీతో ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ప‌టిదార్, మార్కండే బౌలింగ్ హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌ను సాధించాడు. ఆ త‌ర్వాత కోహ్లీ కూడా జ‌త కూడ‌టంతో స్కోరు బోర్డు ప‌రుగులెత్తింది. ఈక్ర‌మంలో ముందుగా 37 బంతుల్లో కోహ్లీ.. ఫిఫ్టీ పూర్తి చేసుకుని ఔట‌య్యాడు. మ‌రుస‌టి ఓవ‌ర్లోనే 17 బాల్స్ పిఫ్టీ కొట్టిన ప‌టిదార్.. అదే ఓవ‌ర్లో పెవిలియ‌న్ కు చేరాడు. చివ‌ర్లో టిమ్ డేవిడ్ (34 నాటౌట్) మూడు సిక్స‌ర్లు కొట్ట‌డంతో ఆర్సీబీ భారీ స్కోరును సాధించింది. మిగ‌తా బౌల‌ర్లలో ట్రెంట్ బౌల్ట్, మిషెల్ శాంట్న‌ర్, శార్దూల్ ఠాకూర్ ల‌కు త‌లో వికెట్ ద‌క్కింది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 KKR VS GT Result Update: GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
Sunil Narine IPL Record: సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర -  ఆ ఘ‌న‌త సాధించిన తొలి విదేశీ క్రికెటర్‌గా రికార్డు
సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర -  IPLలో ఆ ఘ‌న‌త సాధించిన తొలి విదేశీ క్రికెటర్‌గా రికార్డు
Angkrish Raghuvanshi Shines: గంభీర్, ఉత‌ప్ప‌ల స‌ర‌స‌న‌ రఘువంశీ .. గుజరాత్‌పై కోల్‌కతా రికార్డు స్కోరు
గంభీర్, ఉత‌ప్ప‌ల స‌ర‌స‌న‌ రఘువంశీ .. గుజరాత్‌పై కోల్‌కతా రికార్డు స్కోరు
Anshul Kamboj Expensive Spell: CSK బౌలర్ అన్షుల్ కాంబోజ్ చెత్త రికార్డు: LSG పై భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్
CSK బౌలర్ అన్షుల్ కాంబోజ్ చెత్త రికార్డు: LSG పై భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్
Advertisement

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS GT Result Update: GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
GTకి షాకిచ్చిన KKR.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం చేసుకున్న ర‌హానే సేన‌.. స‌త్తా చాటిన అలెన్, ర‌ఘువంశీ, న‌రైన్
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
Bandi Sanjay About Bandi Bhagirath: బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
బండి భగీరథ్‌ను ముందే పోలీసులకు అప్పగిద్దామనుకున్నా.. కానీ: బండి సంజయ్
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
Angkrish Raghuvanshi Shines: గంభీర్, ఉత‌ప్ప‌ల స‌ర‌స‌న‌ రఘువంశీ .. గుజరాత్‌పై కోల్‌కతా రికార్డు స్కోరు
గంభీర్, ఉత‌ప్ప‌ల స‌ర‌స‌న‌ రఘువంశీ .. గుజరాత్‌పై కోల్‌కతా రికార్డు స్కోరు
ఇథనాల్‌ దిశగా ముందడుగు! First Flex Fuel SUV కారు విడుదల చేయనున్న Tata Motors
ఇథనాల్‌ దిశగా ముందడుగు! First Flex Fuel SUV కారు విడుదల చేయనున్న Tata Motors
Embed widget