IPL 2026 RCB Grand Victory: ఐపీఎల్ 2026 సీజ‌న్ తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్థాయికి త‌గ్గ ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించి, బోణీ కొట్టింది. శ‌నివారం చిన్న‌స్వామి స్టేడియంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన మ్యాచ్ లో 6 వికెట్ల‌తో ఘ‌న‌విజ‌యం సాధించింది. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 201 ప‌రుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిష‌న్ (38 బంతుల్లో 80, 8 ఫోర్లు, 5 సిక్సర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో జేక‌బ్ డ‌ఫీ, రిమారియో షెఫ‌ర్డ్ ల‌కు మూడేసి వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేద‌న‌ను 15.4 ఓవ‌ర్ల‌లోనే 4 వికెట్ల‌కు 203 ప‌రుగులు చేసి, కంప్లీట్ చేసింది. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్బ్ ఫిఫ్టీ (38 బంతుల్లో 69 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పెయిన్ కు రెండు వికెట్లు దక్కాయి. ఈ విజ‌యంతో 2026 సీజ‌న్ ను ఘ‌నంగా ప్రారంభించిన‌ట్లు అయింది. 

ప‌డిక్క‌ల్ వీర‌విహారం..

ఇక భారీ ఛేజింగ్ తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఇన్నింగ్స్ రెండో తొలి బంతికే విధ్వంస‌క‌ర ఫిల్ సాల్ట్ (8) పెవిలియ‌న్ కు చేరాడు. జై దేవ్ ఉనాద్క‌ట్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్ర‌య‌త్నించిన సాల్ట్.. హెన్రిచ్ క్లాసెన్ చేతికి చిక్కాడు. క్యాచ్ ప‌ట్టే క్ర‌మంలో అనికేత్ వ‌ర్మను ఢీకొనే ప్ర‌మాదం నుంచి త్రుటిలో త‌ప్పించుకున్న క్లాసెన్ అద్భుత రీతిలో క్యాచ్ కంప్లీట్ చేశాడు. అయితే ఈ ద‌శ‌లో బ్యాటింగ్ కు దిగిన దేవదత్ ప‌డిక్క‌ల్ స్టన్నింగ్ ఫిఫ్టీ (26 బంతుల్లో 61, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) తో చెల‌రేగి పోయాడు. ఆడిన తొలి బంతినే సిక్స‌ర్ గా మ‌లిచిన ప‌డిక్క‌ల్.. వెనుదిరిగి చూడ‌లేదు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో చెల‌రేగిన ప‌డిక్క‌ల్.. స‌న్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. త‌ర్వాత ఓవ‌ర్ల‌లో రెండు ఫోర్లు కొట్టిన ప‌డిక్క‌ల్.. పైన్ వేసిన ఆ త‌ర్వాత ఓవ‌ర్ల‌లో రెండు సిక్స‌ర్లు, ఒక ఫోర్ తో చిత‌క్కొట్టాడు. ఆ త‌ర్వాత కోహ్లీ కూడా స‌త్తా చాట‌డంతో ప‌వ‌ర్ ప్లేలోనే 76 ప‌రుగుల‌ను ఆర్సీబీ పిండుకుంది. 

101 ప‌రుగుల భాగ‌స్వామ్యం..ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత కూడా ప‌డిక్క‌ల్-కోహ్లీ జోరు కొన‌సాగింది. ముఖ్యంగా 300కి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన ప‌డిక్క‌ల్ కేవలం 21 బంతుల్లోనే ఫిప్టీ పూర్తి చేశాడు. వీరిద్ద‌రూ ధాటిగా ఆడ‌టంతో రెండో వికెట్ కు 101 ప‌రుగుల భాగ‌స్వామ్యం న‌మోదైంది. ఆ త‌ర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్ర‌మంలో ప‌డిక్క‌ల్, కెప్టెన్ ర‌జ‌త్ ప‌తిదార్ (31), వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జితేశ్ శ‌ర్మ డ‌కౌట్ గా పెవిలియ‌న్ కు చేరినా కోహ్లీ మ‌రో ఎండ్ లో స్థిరంగా నిలిచాడు. 33 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. టిమ్ డేవిడ్ (16 నాటౌట్) తో కలిసి ఛేజింగ్ ను పూర్తి చేశాడు. బ్యాటింగ్ లో మంచి ప్రదర్శనే చేసిన, బౌలింగ్ లో తేలిపోవడంతో సన్ ఓటమి పాలు కాక తప్పలేదు. ప్రత్యర్థులను కట్టడి చేసే బౌలర్లు లేకపోవడం సన్ కు శాపంగా మారింది.