అన్వేషించండి

IPL 2026 SRH In Top Place: 'టాప్' లేపిన స‌న్ రైజ‌ర్స్.. పంజాబ్ పై ఆల్ రౌండ్ షో.. స‌త్తా చాటిన క్లాసెన్, ఇషాన్, క‌మిన్స్.. కాన్టీ సెంచ‌రీ వృథా.. పంజాబ్ కు హ్యాట్రిక్ లాస్

ముందుగా బ్యాటింగ్ లో స‌త్తా చాటిన సన్.. ఆ త‌ర్వాత బౌలింగ్ లోనూ రాణించిన పంజాబ్ ను బోల్తా కొట్టించింది. మ‌రోవైపు ఏడో విజ‌యంతో స‌న్ రైజ‌ర్స్ టేబుల్ టాప‌ర్ గా నిలిచింది.

IPL 2026 SRH VS PBKS Live Updates: ఐపీఎల్ 2026 సీజ‌న్లో మాజీ చాంపియ‌న్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ దుమ్ము రేపింది. బుధ‌వారం టేబుల్ టాప‌ర్ పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో 33 ప‌రుగుల‌తో ఘ‌నవిజ‌యం సాధించింది. దీంతో తొలిసారిగా టోర్నీలో టాప్ ప్లేస్ ను ద‌క్కించుకుంది. అంత‌కుముందు స్థానిక హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 235 ప‌రుగులు చేసింది. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (43 బంతుల్లో 69, 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచి, ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. అనంత‌రం ఛేజింగ్ లో పంజాబ్ అనుకున్న స్థాయిలో రాణించ‌లేక‌పోయింది. ఓవ‌ర్ల‌న్నీ ఆడిన పంజాబ్ .. 7 వికెట్ల‌కు 202 ప‌రుగులు చేసి, ఓడిపోయింది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ కూప‌ర్ కాన్లీ సూప‌ర్బ్ సెంచ‌రీ (59 బంతుల్లో 107 నాటౌట్, 7 ఫోర్లు, 8 సిక్స‌ర్లు)తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో పాట్ క‌మిన్స్, శివాంగ్ కుమార్ కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. ఈ విజ‌యంతో ఏడు విజ‌యాల‌తో టేబుల్ టాప్ ప్లేస్ ను స‌న్ రైజ‌ర్స్ ద‌క్కించుకుంది. మ‌రోవైపు పంజాబ్ కు ఇది వ‌రుస‌గా మూడో ఓట‌మి కావ‌డం విశేషం. గురువారం జ‌రిగే మ్యాచ్ లో రాయ‌ల్ చాలేంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నుంది. 

ఖేల్ ఖతం..
భారీ స్కోరుతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. సూప‌ర్ ఫామ్ లో ఉన్న ప్రియాంశ్ ఆర్య (1) తొలి ఓవ‌ర్లోనే ఔట్ కావ‌డం షాకింగ్ గా మారింది. త‌ర్వాతి ఓవ‌ర్ లోనే మ‌రో విధ్వంస‌క ఓపెనర్ ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ (3) కూడా వెనుదిర‌గ‌డంతో పంజాబ్ కోలుకోలేక‌పోయింది. ఈ సీజ‌న్ లో వీరిద్ద‌రూ మెరుపు ఆరంభాల‌ను ఇస్తూ, 
రాణిస్తున్నారు. అయితే వ‌రుస బంతుల్లో వీరిద్ద‌రూ వెనుదిరగ‌డంతో పంజాబ్ క‌ష్టాల్లో ప‌డింది. ఆ త‌ర్వాత కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (5)ను ఇషాన్ మ‌లింగా బోల్తా కొట్టించాడు. ఆ త‌ర్వాత మార్క‌స్ స్టొయినిస్ (28) వేగంగా ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే శివాంగ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి, కీప‌ర్ క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ కు చేరాడు. దీంతో పంజాబ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. 

కాన్నోలీ ఒంట‌రి పోరాటం..
మ‌రోవైపు నాలుగు వికెట్లు ప‌డినా, కాన్నోలీ ఏమాత్రం వెనుకంజ వేయ‌లేదు. చ‌క‌చ‌కా ప‌రుగులు సాధిస్తూ, వేగంగా ఆడాడు. దీంతో ప‌వ‌ర్ ప్లేలో 57 ప‌రుగులు వ‌చ్చాయి.  సూర్యాంశ్ షెడ్గే (25) త‌న‌కు మంచి స‌హ‌కారం అందించాడు. వీరిద్ద‌రూ ఐదో వికెట్ కు 47 ప‌రుగులు జోడించ‌డంతో పంజాబ్ కాస్త కోలుకున్న‌ట్లు అయింది. ఈ ద‌శ‌లో 34 బంతుల్లో అర్థ సెంచ‌రీ చేసిన కాన్నోలీ, అన్ స్టాప‌బుల్ గా అనిపించాడు. మ‌రోవైపు షెడ్గే ఔటైన త‌ర్వాత శ‌శాంక్ సింగ్ (4), మార్కో యన్సెస్ (19) విఫ‌ల‌మైనా త‌ను మాత్రం చివ‌రికంటా నిలిచాడు. ఈక్ర‌మంలో 57 బంతుల్లో సెంచ‌రీని కంప్లీట్ చేసుకున్నాడు. అతని పోరాటంతో పంజాబ్ ర‌న్ రేట్ ప‌డిపోకుండా ఓట‌మి పాలైంది. ఇక చ‌క్క‌గా బౌలింగ్ చేసిన స‌న్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
MI Creates IPL Superb Record: ఐపీఎల్ చరిత్రలో MI సరికొత్త రికార్డు: బుమ్రా సారథ్యంలో అరుదైన మైలురాయి!
ఐపీఎల్ చరిత్రలో MI సరికొత్త రికార్డు: బుమ్రా సారథ్యంలో అరుదైన మైలురాయి!
CSK Sign Dian Forrester as Replacement: సీఎస్కే జట్టులో మరో మార్పు: గాయంతో జేమీ ఓవర్టన్ అవుట్.. సౌతాఫ్రికా ఆల్రౌండర్ ఎంట్రీ!
CSK జట్టులో మరో మార్పు: గాయంతో జేమీ ఓవర్టన్ అవుట్.. సౌతాఫ్రికా ఆల్రౌండర్ ఎంట్రీ!
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Shortage: ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
ఎమండోయ్ ఇది చూశారా.. సిలిండర్ల వాహనానికి పోలీస్ ఎస్కార్ట్ - కలికాలం!
Bandi Bhagirath Case Latest News: బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
బండి సంజయ్ ఇంటి నుంచి భయంతో బయటకొచ్చాం.. బాధితురాలి తల్లి సంచలన లేఖ విడుదల
Radhan Pandit: 101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
101 ఏళ్ల వరకు విజయ్ సీఎం.. రష్యా-అమెరికా గొడవలు కూడా తీరుస్తారట - దళపతి తీసేసిన జ్యోతిష్యుడి అతి వైరల్!
NEET UG Exam Online: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే.. నీట్ రీఎగ్జామ్ అభ్యర్థులకు వారం గడువు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
PM Modi కాన్వాయ్‌లో 2 వాహనాలు Range Rover , Fortuner లలో సేఫ్టీ, మైలేజీలలో ఏది బెస్ట్ తెలుసా..
Aviation Fuel Crisis: విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..
విమానం ఒక్క ట్రిప్ వేస్తే ఎన్ని లక్షల రూపాయల ఇంధనం ఖర్చవుతుందో తెలుసా..? క్రూడ్ సంక్షోభం విమానయానంపై ఎంతటి ప్రభావం చూపుతుందంటే..
Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Bad Boy Karthik OTT : ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
Embed widget