MI vs LSG: నేడు ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్.. ఓడితే ఐపీఎల్ నుంచి ఔట్
IPL 2026: ముంబైలోని వాంఖేడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబై ఇండియన్స్ (MI) మధ్య కీలక మ్యాచ్ నేటి రాత్రి జరుగుతుంది. ఓడిన జట్టు కచ్చితంగా ఇంటికి వెళ్తుంది.

Mumbai Indians vs Lucknow Super Giants | ఐపీఎల్ 2026లో లీగ్ స్టేజీలో ఇప్పటివరకు 46 మ్యాచ్‌లు జరిగాయి. మే 4న సోమవారం నాడు 47వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG), ముంబై ఇండియన్స్ (MI) మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో కింద ఉన్న జట్ల మధ్య జరిగే మ్యాచ్ రిజల్ట్ ఓ జట్టును ఇంటికి పంపుతుంది.
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ 8 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్స్ టేబుల్‌లో 10వ స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు కూడా 9 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ జట్లకు నేటి మ్యాచ్ చాలా కీలకం. రేసులో నిలవాలంటే ఇక నుంచి ప్రతీ మ్యాచ్ నెగ్గితే సరిపోదు, భారీగా రన్ రేట్‌తోనే నెగ్గితేనే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో జట్టు ప్రధానంగా బ్యాటింగ్‌లో వైఫల్యాలను ఎదుర్కొంటోంది. లక్నో బ్యాటర్లు విఫలమవుతున్నా, వారి బౌలర్లు మాత్రం మెరుగ్గానే రాణిస్తున్నారు. లక్నో గత మ్యాచ్‌లో మోహ్సిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసినా అతడి శ్రమ వృధాగా పోయింది. ఇక ముంబై ఇండియన్స్ తమ గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయి పరిస్థితి మరింత దిగజార్చుకుంది.
We fight till the End 💪 pic.twitter.com/pCrJWkc181
— Mumbai Indians (@mipaltan) May 4, 2026
ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలివే..
స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్ల వరుస మ్యాచులలో ఫెయిల్ కావడంతో ముంబై జట్టుకు వరుస ఓటములు తప్పడం లేదు. హార్దిక్ కెప్టెన్సీపై గత సీజన్ నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా రోహిత్ శర్మ లేకపోవడంతో జట్టు మరింత బలహీనపడినట్లు కనిపిస్తోంది. జట్టులో రోహిత్ ఉంటే కనీసం కెప్టెన్ కు గేమ్ ప్లాన్ లో హెల్ప్ అయ్యేవాడు.
అయితే, ముఖాముఖీ పోరులో రిజల్ట్స్ చూస్తే లక్నో రికార్డు చాలా బాగుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు లక్నో, ముంబై జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్‌లు జరగగా, అందులో 6 మ్యాచ్‌లలో లక్నో విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలోనూ రెండు మ్యాచులలో లక్నో గెలుపొందడం ప్లస్ పాయింట్. నేటి మ్యాచులో ఓడిన జట్టు టెక్నికల్ గానూ ఐపీఎల్ రేసు నుంచి తప్పుకున్నట్లే.
ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, విల్ జాక్స్, రోహిత్ శర్మ, రాబిన్ మింజ్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), శ్రీజిత్ కృష్ణన్ (వికెట్ కీపర్), బెవాన్ జాకబ్స్, కేశవ్ మహారాజ్, రాజ్ అంగద్ బావా, విఘ్నేష్ పుత్తూరు, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్, కర్ణ్ శర్మ, దీపక్ చాహర్, అశ్విని కుమార్, రీస్ టోప్లీ, విఎస్ పెన్మెత్స, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జస్ప్రీత్ బుమ్రా.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆటగాళ్లు: రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్‌రమ్, మాథ్యూ బ్రీత్జ్‌కే, ముకుల్ చౌదరి, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, వనిందు హసరంగ, ఆయుష్ బదోని, మహ్మద్ షమీ, అవేష్ ఖాన్, ఎం. సిద్ధార్థ్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, దిగ్వేష్ సింగ్, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, అన్రిచ్ నోర్ట్జే, నమన్ తివారీ, మయాంక్ యాదవ్, మోహ్సిన్ ఖాన్.
ట్రెండింగ్ వార్తలు




















