IPL 2026 LSG VS RCB Result Update: ఎట్టకేలకు లక్నోకు విజయం.. ఆరు పరాజయాల తర్వాత గెలుపుబాట, రాణించిన మార్ష్, ప్రిన్స్.. ఆర్సీబీకి షాక్
థ్రిల్లింగ్ గా జరిగిన మ్యాచ్ లో ఆఖరకు ఒత్తిడిని అధిగమించిన లక్నో విజేతగా నిలిచింది. తొలుత భారీ స్కోరు సాధించి, ఆ తర్వాత బౌలింగ్ లో రాణించిన లక్నో ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది.

IPL 2026 LSG VS RCB Latest Update: ఐపీఎల్ 2026 సీజన్ లో ఎట్టకేలకు లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు బాట పట్టింది. వరుసగా ఆరు పరాజయాల తర్వాత తాజాగా రాయల్ చాలేంజర్స్ బెంగళూరుపై 9 పరుగులతో విజయం సాధించింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఓపెనర్ మిషెల్ మార్ష్ స్టన్నింగ్ సెంచరీ (56 బంతుల్లో 111, 9 ఫోర్లు, 9 సిక్సర్లు) తో చెలరేగాడు. బౌలర్లలలో హేజిల్ వుడ్, క్రునాల్ పాండ్యా, రసిక్ సలామ్ కు తలో వికెట్ దక్కింది. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో టార్గెట్ ను 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్ణయించారు. అయితే ఓవర్లన్నీ ఆడిన ఆర్సీబీ.. 6 వికెట్లకు 203 పరుగులు మాత్రమే చేసింది. రజత్ పతిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో సూపర్బ్ ఫిఫ్టీ (31 బంతుల్లో 61, 3 ఫోర్లు, 6 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ కు మూడు వికెట్లు దక్కాయి. తాజా విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను లక్నో సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఆర్సీబీకిది వరుసగా రెండో పరాజయం కావడం విశేషం. శుక్రవారం జరిగే మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
Takes a lot of heart and skill to ace the 20th over. Digvesh, you’ve got that fight in you ❤️💙 pic.twitter.com/5hJiQn8oAo
— Lucknow Super Giants (@LucknowIPL) May 7, 2026
బిట్టర్ స్టార్ట్..
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్బీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసక ఓపెనర్ జాకబ్ బెతెల్ (4)ను మహ్మద్ షమీ తన తొలి ఓవర్లోనే బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఓవర్లోనే ఆర్సీబీకి కోలుకోలేని ఝలక్ తగిలింది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీని అద్భుత బంతితో ప్రిన్స్ యాదవ్ డకౌట్ చేశాడు. దీంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఈ దశలో దేవదత్ పడిక్కల్ (34) తో కలిసి పతిదార్ ఇన్నింగ్స్ ను నిర్మించాలని ప్రయత్నించాడు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. పవర్ ప్లేలో 40 పరుగులు జత చేసినా, ఆ తర్వాత వీరిద్దరూ మరింత ధాటిగా ఆడారు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే పతిదార్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ కు వచ్చి, అద్భుతమైన రిటర్న్ క్యాచ్ తో పడిక్కల్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో 95 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
థ్రిల్లింగ్ ఫినిష్..
ఆ తరవాత కాసేపటికే జితేశ్ శర్మ (1)తోపాటు పతిదార్ ఔట్ కావడంతో ఆర్సీబీ సగం జట్టును కోల్పోయింది. ఈ దశలో టిమ్ డేవిడ్ (40), క్రునాల్ పాండ్యా (28 నాటౌట్) పోరాటం కొనసాగించారు. ముఖ్యంగా క్రీజులో ఉన్నంత సేపు డేవిడ్ వణికించాడు. నాలుగు ఫోర్లు, 3 సిక్సర్లతో వేగంగా పరుగులు సాధించడంతో ఆర్సీబీ టార్గెట్ వైపు వేగంగా సాగింది. అయితే షాబాజ్ అహ్మద్ అతడిని ఔట్ చేసి లక్నోకు బ్రేకిచ్చాడు. అతను ఔటైన తర్వాత క్రునాల్ తోపాటు రొమారియో షెఫర్డ్ (23 నాటౌట్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖరి ఓవర్లో 20 పరుగులు విజయానికి కావాల్సి ఉండగా దిగ్వేష్ రాఠీ అద్భుతంగా బౌలింగ్ చేసి, 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో లక్నో ఆరు పరాజయాల తర్వాత తొలి విజయాన్ని సాధించింది.
Before You Go
Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
ట్రెండింగ్ వార్తలు



















