IPL 2026 KKR VS RCB Result Update: కోహ్లీ అన్ బీటెన్ సెంచరీ.. ఆర్సీబీ ఈజీ విక్టరీ.. టాప్ ప్లేస్ కు పతిదార్ సేన.. సత్తా చాటిన పడిక్కల్, కేకేఆర్ కు నిరాశ
కోహ్లీ సెంచరీతో కదం తొక్కడంతో ఆర్సీబీ మరో విజయాన్ని సాధించింది. పాయింట్ల పట్టికలో మరోసారి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇక నాలుగు వరుస విక్టరీల తర్వాత కేకేఆర్ చతికిల పడింది.

IPL 2026 KKR VS RCB Latest Update:ఐపీఎల్ 2026 సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలేంజర్స్ బెంగళూరు మళ్లీ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. వరుసగా రెండో విజయంతో 16 పాయింట్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది. మరో సొంతగడ్డ రాయ్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ అంగ్ క్రిష్ రఘువంశీ సూపర్బ్ ఫిఫ్టీ (46 బంతుల్లో 71, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్, రసిక్ సలామ్ కు తలో వికెట్ దక్కింది. అనంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ (60 బంతుల్లో 105 నాటౌట్, 11 ఫోర్లు, 3 సిక్సర్లు) తో చెలరేగడంతో టార్గెట్ ను ఆర్సీబీ ఈజీగా ఛేజ్ చేసింది. కేవలం 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసి సునాయాస విజయం సాధించింది. బౌలర్లలో కార్తీక్ త్యాగీకి మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను ఆర్సీబీ మరింత మెరుగు పర్చుకుంది. మరోవైపు వరుసగా నాలుగు విజయాల తర్వాత కేకేఆర్ ఓటమి పాలు కావడం విశేషం. గురువారం జరిగే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
𝗛.𝗨.𝗡.𝗗.𝗥.𝗘.𝗗 💯
— IndianPremierLeague (@IPL) May 13, 2026
A scintillating ton from the chase master 👏👏
9th #TATAIPL hundred for Virat Kohli 🫡
Updates ▶️ https://t.co/X27WecYjiZ#KhelBindaas | #RCBvKKR | @imVkohli pic.twitter.com/GgyzG63rUf
బెతెల్ విఫలం..
సహచర ఆటగాడు ఫిల్ సాల్ట్ స్థానంలో ఓపెనింగ్ లో బరిలోకి దిగిన జాకబ్ బెతెల్ (15) ఈ మ్యాచ్ లో మరోసారి విఫలమయ్యాడు. అయితే కోహ్లీ మాత్రం తన క్లాస్ చూపించాడు. ఛేజ్ మాస్టర్ అనే పేరును నిలబెట్టుకుంటూ, రెండు డకౌట్ల తర్వాత ఈసారి సెంచరీతో గర్జించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన కోహ్లీ, తర్వాత గేర్ మార్చాడు. మరో బ్యాటర్ దేవ్ దత్ పడిక్కల్ (39) తో కలిసి రెండో వికెట్ కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇద్దరూ పర్యాటక బౌలర్లను చితక్కొట్టడంతో పవర్ ప్లేలో 66 పరుగులతో సత్తా చాటింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 92 పరుగులు జోడించాక పడిక్కల్ ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది.
పదో సెంచరీ..
పడిక్కల్ ఔటైనా.. కోహ్లీ ఏమాత్రం వెనుదిరగలేదు. తపస్సు చేస్తున్నట్లు బ్యాటింగ్ లో దూసుకుపోయాడు. అంతకుముందు 32 బంతుల్లో ఫిఫ్టీ చేసిన కోహ్లీ.. వేగంగా సెంచరీ వైపు దూసుకెళ్లాడు. మధ్యలో కెప్లెన్ రజత్ పతిదార్ (11), టిమ్ డేవిడ్ (2) విఫలమైనా.. తను మాత్రం స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈక్రమంలో 56 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో కోహ్లీకిది పదో సెంచరీ కావడం విశేషం. ఇండియన్ బ్యాటర్లలో అత్యధిక సెంచరీల రికార్డను తన పేరిట లిఖించుకున్నాడు. ఈక్రమంలోనే ఈ ఫార్మాట్లో 14 వేల పరుగుల మార్కును కూడా దాటాడు. చివర్లో జితేశ్ శర్మ (8 నాటౌట్) తో కలిసి కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఓవరాల్ గా రెండో వరుస విజయంతో పాయింట్ టేబుల్లో అగ్రస్థానానికి ఆర్సీబీ చేరుకుంది.
Before You Go
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















