IPL 2026 GT vs SRH Result Update: బ్యాటింగ్ వైఫల్యంతో SRH ఘోర పరాజయం.. అన్ని రంగాల్లో రాణించిన జీటీ, టాప్ ప్లేస్ కు గిల్ సేన, సత్తా చాటిన సుదర్శన్, రబాడ, హోల్డర్
బౌలర్లకు అనుకూలించే పిచ్ వ్యూహంతో సన్ రైజర్స్ ను గుజరాత్ బోల్తా కొట్టించింది. ముందుగా బ్యాటింగ్ లో చాలేంజింగ్ స్కోరు చేసిన గుజరాత్, బౌలర్లు రాణించడంతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

IPL 2026 GT VS SRH Latest Update: ఐపీఎల్ 2026 సీజన్ లో మాజీ చాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 82 పరుగులతో ఓడిపోయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ సూపర్బ్ ఫిఫ్టీ (44 బంతుల్లో 61, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో సన్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకు ఆలౌటయ్యారు. పాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ (19) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో కగిసో రబాడ, జేసన్ హోల్డర్ కు తలో మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఎనిమిదో విజయంతో గుజరాత్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. ఇక బుధవారం జరిగే మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ చాలేంజర్స్ బెంగళూరు తలపడనుంది.
This one is for all the warriors who never stop fighting 💜🎗️#GTCares pic.twitter.com/U5KZQ0cMvo
— Gujarat Titans (@gujarat_titans) May 12, 2026
పవర్ ప్లేలోనే ఖతం..
స్లో వికెట్ పై ఓ మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ వణికించాడు. అతని బౌలింగ్ లో ఆడేందుకు తంటాలు పడిన ఓపెనర్ ట్రావిస్ హెడ్, ఆఖరికి నాలుగో బంతికి డకౌటయ్యాడు. ఆ తర్వాత ఆ ఓవర్ ను మెయిడిన్ చేసిన సిరాజ్.. శుభారంభం అందించాడు. అయితే రెండో ఓవర్ వేసిన రబాడ, సన్ కు పెద్ద షాకిచ్చాడు. సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ (6)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. నిజానికి కాస్త రూమ్ తీసుకుని ఆడదామని అభిషేక్ ట్రై చేయగా, అతడిని ఫాలో చేస్తూ, వేసిన బంతి, అభిషేక్ బ్యాట్ ను తాకి, నేరుగా వికెట్లను గిరాటేసింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో ఇషాన్ కిషన్ (11), స్మరణ్ రవిచంద్రన్ (9) ను ఔట్ చేసి పెద్ద షాకిచ్చాడు. దీంతో ఇక్కడే ఫలితం దాదాపుగా తేలిపోయింది.
Made tonight's match even more special 💜🔝#GTCares pic.twitter.com/ozwO75GV69
— Gujarat Titans (@gujarat_titans) May 12, 2026
కమిన్స్ పోరాటం..
ఇక పవర్ ప్లేలో కేవలం 34 పరుగులే చేసిన సన్.. టార్గెట్ ఛేదిస్తున్నట్లు ఎప్పుడూ అనిపించలేదు. క్రీజులో డేంజరస్ గా గడిపి, కొన్ని బౌండరీలు కొట్టిన సలీల్ ఆరోరా (16)ను తన తొలి ఓవర్లోనే ప్రసిధ్ కృష్ణ ఔట్ చేశాడు. ఇక తర్వాతి ఓవర్లోనే ఆదుకుంటాడనుకున్న హెన్రిచ్ క్లాసెన్ (14)ను హోల్డర్ పెవిలియన్ కు పంపడంతో సన్ కథ దాదాపుగా ముగిసి పోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో చాలా వెనుకగా వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (2) కూడా విఫలమయ్యాడు. ఆఖర్లో కమిన్స్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో స్కోరు ఆ మాత్రమైన వచ్చింది. తను వెనుదిరిగాక ఆరెంజ్ ఆర్మీ పరాజయం ఖాయమైపోయింది. 3 వికెట్లు తీసిన రబాడకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక 16 పాయింట్లు సాధించిన గుజరాత్ దాదాపుగా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకున్నట్లేనని తెలుస్తోంది.
Before You Go
Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















