IPL 2026 GT VS RR Result Update: జీటీకి వరుసగా నాలుగో విక్టరీ.. టోర్నీలోనే అతి పెద్ద విజయం.. రాణించిన గిల్, సుదర్శన్, రషీద్, హోల్డర్, రాయల్స్ చిత్తు
వరుసగా నాలుగో విజయంతో ప్లే ఆఫ్ రేసులో జీటీ దూసుకు పోయింది. అలాగే టోర్నీలోనే అతి పెద్ద విజయాన్ని సాధించి, సత్తా చాటింది. మరోవైపు ఘోర పరాజయంతో నాకౌట్ రేసులో రాయల్స్ వెనుకంజలో నిలిచింది.

IPL 2026 GT VS RR Latest Update: ఐపీఎల్ 2026 సీజన్ లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపుతోంది. ఈ సీజన్ లో వరుసగా నాలుగో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని సాధించింది. శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 77 పరుగులతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (44 బంతుల్లో 84, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో బ్రిజేశ్ శర్మ రెండు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఛేజింగ్ లో బ్యాటింగ్ వైఫల్యంతో రాయల్స్ తేలిపోయింది. కేవలం 16.3 ఓవర్లలో 152 పరుగులకు కుప్పకూలింది. వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (25 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో రషీద్ కు నాలుగు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ఏకంగా టాప్-2కు గుజరాత్ చేరుకుంది. మరోవైపు రాయల్స్ కిది రెండో ఓటమి కావడం విశేషం. ఆదివారం డబుల్ హెడర్ లో భాగంగా చెన్నైలో జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్, రాయ్ పూర్ లో జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో రాయల్ చాలేంజర్స్ బెంగళూరు తలపడనుంది.
Best cricket khelni thi, khel gaye! 😌 pic.twitter.com/KxTNZZX5fs
— Gujarat Titans (@gujarat_titans) May 9, 2026
శుభారంభం లభించినా..
భారీ టార్గెట్ తో బరిలోకి దిగినా, అంచనాలకు అనుగుణంగా ఓపెనర్ వైభవ్ సూర్య వంశీ (16 బంతుల్లో 36, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తో మంచి స్టార్ట్ ఇచ్చాడు. మూడు కళ్లు చెదిరే సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అయితే చక్కని బంతితో మహ్మద్ సిరాజ్.. అతడిని పెవిలియన్ కు పంపడంతో 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ కమ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (3) పుల్ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. కాసేపటికే షిమ్రాన్ హిట్మెయర్ (6) త్వరగా ఔట్ కావడంతో రాయల్స్ కు షాక్ తగిలింది. అయినప్పటికీ పవర్ ప్లేలో 78 రన్స్ తో భారీగానే పరుగులు సాధించింది.
జడేజా పోరాటం..
మూడు వికెట్లు త్వరగా కోల్పోయినా, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (24) తో కలిసి జడేజా పోరాటం చేశాడు. వీరిద్దరూ పర్యాటక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జురేల్ వేగంగా పరుగులు సాధించాడు. ఆరంభంలో జడేజా కూడా త్వరగా పరుగులు సాధించాడు. అయితే జోరుగా కొనసాగుతున్న ఈ జంటను రషీద్ ఖాన్ దెబ్బ తీశాడు. చక్కని బంతితో జురేల్ ను బౌల్ చేశాడు. మరో బంతి తేడాతో డోనోవాన్ ఫెరీరా (4) ను కూడా బౌల్డ్ చేయడంతో రాయల్స్ సగం వికెట్లను కోల్పోయింది. ఓ ఎండ్ లో జడేజా నిలబడినా, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో రాయల్స్ టార్గెట్ ఛేజ్ చేయడంలో వెనుక బడింది. ఆఖరుకు జడేజాను ను కూడా రషీద్ పెవిలియన్ కు పంపడంతో రాయల్స్ కథ ముగిసింది. ఈ మ్యాచ్ లో సాధించిన విజయం, టోర్నీలోనే గుజరాత్ సాధించిన అతి పెద్ద విజయం కావడం విశేషం. ఇక మిగతా బౌలర్లలో జాసన్ హోల్డర్ కు మూడు, రబాడకు రెండు వికెట్లు సాధించాడు. అలాగే పర్పుల్ క్యాప్ ను కూడా రబాడ సొంతం చేసుకున్నాడు.
Before You Go
Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
ట్రెండింగ్ వార్తలు



















