IPL 2026 GT VS CSK Result Update: చెన్నై ఇంటికి.. జీటీ చేతిలో ఘోర పరాజయం.. రాణించిన సుదర్శన్, గిల్, సిరాజ్, రాబడ
ఐపీఎల్లో చెన్నై కథ ముగిసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యంతో చేతులెత్తేసింది. ఘన విజయం సాధించిన జీటీ.. టాప్-2 ప్లేస్ ను దక్కించుకుంది. సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ ను సాధించాడు.

IPL 2026 GT VS CSK Latest Update: తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చేతులెత్తేసింది. మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 89 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో టోర్నీ నుంచి బయటకు వెళ్లిన లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ సరసన నిలిచింది. అహ్మదాబాద్ లో జరిగిన ఈ లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జీటీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ స్టన్నింగ్ ఫిఫ్టీ (53 బంతుల్లో 84, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) తో ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. బౌలర్లలో ముకేశ్ చౌదరీ, స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్ కు తలో వికెట్ దక్కింది. అనంతరం ఛేజింగ్ లో బ్యాటింగ్ వైఫల్యంతో చెన్నై కేవలం 13.4 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. ఆల్ రౌండర్ శివమ్ దూబే (17 బంతుల్లో 47, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సిక్సర్లతో అలరించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ కు మూడేసి వికెట్లు దక్కాయి. ఈ విజయంతో టాప్-2 ప్లేస్ ను జీటీ దక్కించుకుంది. ఇక చెన్నైకిది వరుసగా మూడో పరాజయం కావడం విశేషం. శుక్రవారం జరిగే మ్యాచ్ లో రాయల్ చాలేంజర్స్ బెంగళూరుతో హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
Too fast. Too furious. 🏎🟀
— IndianPremierLeague (@IPL) May 21, 2026
4️⃣ wickets in the powerplay for #GT 🔥
Updates ▶️ https://t.co/p5TP9NLREX #TATAIPL | #KhelBindaas | #GTvCSK | @gujarat_titans pic.twitter.com/jSg7nlANLB
సిరాజ్ విధ్వంసం..
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నైకి సిరాజ్ ఆరంభంలోనే షాకిచ్చాడు. మంచి పామ్ లో ఉన్న సంజూ శాంసన్ ను తొలి బంతికే డకౌట్ చేశాడు. ఆ తర్వాత మరుసటి ఓవర్లో రెండు బంతుల తేడాతో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (16), ఉర్విల్ పటేల్ ను డకౌట్ గా చేశాడు. దీంతో 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది. కాసేపటికే రబాడ మథ్యూ షార్ట్ (24) ను పెవిలియన్ కు పంపడంతో చెన్నై కోలుకోలేకపోయింది. దీంతో పవర్ ప్లేలో కేవలం 58 పరుగులు చేసి, ఛేజింగ్ లో వెనుకబడింది.
Read Also: Phil Salt Return To RCB Team: ఆర్‌సీబీకి గుడ్ న్యూస్.. అందుబాటులోకి విధ్వంసక ఓవర్సీస్ ప్లేయర్..!
దుబే పోరాటం..
పవర్ ప్లే ముగిశాక కాసేపటికే కార్తీక్ శర్మ (19) వికెట్ పడటంతో చెన్నై సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో దూబే గర్జించాడు. నాలుగేసి చొప్పున ఫోర్లు, సిక్సర్లు కొట్టడంతో చెన్నై స్కోరు 100 పరుగుల మార్కును దాటింది. అయితే స్కోరు వేగాన్ని పంచే క్రమంలో తను ఔట్ కావడంతో చెన్నై టార్గెట్ కు చాలా దూరంలో నిలిచింది. రబాడతో కలిసి రషీద్ ఖాన్ కూడా చకచకా వికెట్లు తీయడంతో చెన్నై పోరాటం ముగిసింది. CSK బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేసిన సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Before You Go
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















