IPL 2025 Top 2 Positions | భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా వారంపాటు నిలిచిపోయిన ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానుంది. శనివారం రాత్రి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ సీజన్ రీస్టార్ట్ అవుతుంది. లీగ్ దశలో మరో 13 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి, ప్లేఆఫ్ పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు ఇంటిదారి పట్టాయి. ఏడు జట్లు ఇంకా ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి.  ఈ దశలో ఒక్క మ్యాచ్ ఓటమి కూడా ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీయవచ్చు.

Continues below advertisement

టాప్-2 స్థానమే జట్ల ప్రధాన లక్ష్యం

ప్లేఆఫ్ స్థానం కన్ఫామ్ అవుతుందనుకున్న జట్లు ఇప్పుడు టాప్-2 స్థానాల కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్లే ఆఫ్స్ చేరిన జట్లలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లకు ఓ మ్యాచ్ ఓడినా, మరో అవకాశం లభిస్తుంది. దాంతో ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు అవకాశాలను అందిస్తుంది.

Continues below advertisement

టాప్‌లో గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీ 

గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం 11 మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ప్లేఆఫ్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవడానికి ఒక విజయం దూరంలో ఉంది. ఆర్‌సీబీ కూడా 16 పాయింట్లతో ఉంది, రెండు జట్లు టాప్-2 స్థానం కోసం స్ట్రాంగ్ కంటెండర్లుగా ఉన్నాయి.

ప్లే ఆఫ్ రేసులో పంజాబ్, ముంబై, ఢిల్లీ

శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో 7 విజయాలు ఓ మ్యాచ్ రద్దుతో 15 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. టాప్-2లోకి రావడానికి పంజాబ్ మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలవాలి. లేకపోతే గుజరాత్ లేదా ఆర్‌సీబీ ఓ మ్యాచ్ ఓడిపోవాలి. 

4వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రేసులో ఉంది. కానీ వారు టాప్-2లోకి రావడానికి మిగిలిన 3 మ్యాచ్‌లను గెలవాలి. మెరుగైన రన్ రేట్ సాధించక తప్పదు. 

మే 17 నాటికి ఐపీఎల్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ 

1. గుజరాత్ టైటాన్స్: 8 విజయాలు, 3 ఓటములు, 16 పాయింట్లు, NRR +0.793

2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 8 విజయాలు, 3 ఓటములు, 16 పాయింట్లు, NRR +0.482

3. పంజాబ్ కింగ్స్: 7 విజయాలు, 3 ఓటములు, 15 పాయింట్లు, NRR +0.620

4. ముంబై ఇండియన్స్: 7 విజయాలు, 5 ఓటములు, 14 పాయింట్లు, NRR +1.156

5. ఢిల్లీ క్యాపిటల్స్: 6 విజయాలు, 4 ఓటములు, 13 పాయింట్లు, NRR +0.221

6. కోల్‌కతా నైట్ రైడర్స్: 5 విజయాలు, 6 ఓటములు, 11 పాయింట్లు, NRR -0.061

7. లక్నో సూపర్ జెయింట్స్: 5 విజయాలు, 6 ఓటములు, 10 పాయింట్లు, NRR +0.013

8. సన్‌రైజర్స్ హైదరాబాద్: 3 విజయాలు, 7 ఓటములు, 6 పాయింట్లు, NRR -0.455

9. రాజస్థాన్ రాయల్స్: 3 విజయాలు, 9 ఓటములు, 6 పాయింట్లు, NRR -0.672

10. చెన్నై సూపర్ కింగ్స్: 3 విజయాలు, 9 ఓటములు, 6 పాయింట్లు, NRR -0.912   

ఈ సీజన్‌లో కోల్‌కతా  ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి, 5 గెలిచింది, 6 ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కేకేఆర్ ఖాతాలో ప్రస్తుతం 13 పాయింట్లు ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు నేడు ఆర్సీబీతో, మే 25న ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్ నెగ్గితే కేకేఆర్ 15 పాయింట్లకు చేరి ప్లే ఆఫ్ రేసులో ఇంకా ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ ఓడినా, వర్షం పడి రద్దయినా కేకేఆర్ ఇంటిదారి పట్టనుంది.