Ahmedabad Narendra Modi Stadium set to host IPL 2025 final: ఐపీఎల్ 2025 లీగ్ స్టేజ్ దాదాపు ముగియవచ్చింది. మూడు జట్లు ప్లే ఆఫ్స్ చేరగా, మరో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పోటీ పడుతున్నాయి. ఈ సమయంలో ఐపీఎల్ ఫైనల్ కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వేదికగా మారింది. జూన్ 3న జరగనున్న ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్ మోదీ మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

బీసీసీఐ మంగళవారం సుదీర్ఘంగా సమావేశం అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. చండీగఢ్ ముల్లాన్‌పూర్ స్టేడియంలో ఈ ఐపీఎల్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్  జరుగుతాయి. ఐపీఎల్ 2025 మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ మే 29న జరగనుంది. అయితే బెంగళూరులో భారీ వర్షాల కారణంగా వేదికను మార్చారు. మే 29న క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ముల్లాన్‌పూర్ స్టేడియం వేదికగా మారింది. జూన్ 1న క్వాలిఫయర్ 2,  జూన్ 3న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం వేదికగా మారింది.. ఇటీవల ఐపీఎల్ తిరిగి ప్రారంభించిన తర్వాత మొత్తం 17 మ్యాచ్‌లు జరుగుతాయి.

వర్షం కారణంగా మారిన వేదికలు

వర్షం కారణంగా మే 23న సన్‌రైజర్స్, ఆర్సీబీల మధ్య బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌ను లక్నోకు మార్చారు. మే 27న ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్లు జట్లు లక్నో వేదికగా తలపడనున్నాయి. దాంతో SRH మ్యాచ్‌ను లక్నో్ వేదికకు తరలించారు.

మే 8వ తేదీన భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ధర్మశాలలో మధ్యలోనే నిలిపివేసిన మ్యాచ్‌ను మే 24న నిర్వహించనున్నారు. జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయని బీసీసీఐ ఇటీవల ప్రకటించింది.

వర్షాకాలం మొదలవుతున్న కారణంగా వేదికపై నిర్ణయం

దేశంలో వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున, మ్యాచ్ నిర్వహణకు అనుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఐపీఎల్ వేదికలను ఎంపిక చేస్తోంది. అందువల్ల ఫైనల్ మ్యాచ్ నిర్వహణకు అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియాన్ని వేదికగా ఎంపిక చేసినట్లు సమాచారం. దక్షిణాదిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఐపీఎల్ ఫైనల్ నిర్వహించే అవకాశం లేదు. నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో కేరళను తాకనున్నాయి. అనంతరం నాలుగైదు రోజులలో ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయి. ఆపై తెలంగాణలో సైతం రుతుపవనాలు వ్యాపించనున్నాయి.

ఈ 3 జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత

IPL 2025 లో మే 19 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు ప్లేఆఫ్ బెర్తులు కన్ఫామ్ చేసుకున్నాయి.  ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ చివరి బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఇదివరకే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగాయి. లీగ్ స్టేజీ ముగియగానే ఆ జట్టు ఆటగాళ్లు ఇంటిదారి పట్టనున్నారు.