Indian Premier League Complete Schedule : ఐపీఎల్(IPL) 17 సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ(BCCI) విడుదల చేసింది. మార్చి 22న ఐపీఎల్‌ 17వ సీజన్‌ రాజస్థాన్ రాయల్స్‌ బెంగళూరు-చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌తో ప్రారంభమైంది. మొదట తొలి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు  ప్రకటించారు. ఇప్పుడు మిగిలిన అన్ని మ్యాచ్‌లను షెడ్యూల్‌ విడుదల చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో మే 21న క్వాలిఫయర్‌ వన్‌,  మే 24న
ఎలిమినేటర్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. మే 25న క్వాలిఫయర్‌ - 2, మే 26న ఫైనల్‌ మ్యాచ్‌లకు చెన్నైలోని చెపాక్‌ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.  లోక్‌స‌భ ఎన్నిక‌ల న‌గారా మోగిన‌ప్పటికీ ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల‌ను భార‌త్‌లోనే నిర్వహిస్తామ‌ని బీసీసీఐ స్పష్టం చేసింది. తొలి విడత మ్యాచ్‌లు ఏప్రిల్‌ ఏడున ముగియనుండగా ఏప్రిల్ 8 నుంచే రెండో విడత మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్‌ 8న చెన్నై సూప‌ర్ కింగ్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. 


హైదరాబాద్‌లో ఐదు..
రెండో విడతలో హైదరాబాద్‌లో ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. 
ఏప్రిల్‌ 25- సన్‌రైజర్స్‌ వర్సెస్‌ ఆర్సీబీ
మే 2- సన్‌రైజర్స్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ 
మే 8- సన్‌రైజర్స్‌ వర్సెస్‌ లక్నో 
మే 16-సన్‌రైజర్స్‌ వర్సెస్‌ గుజరాత్‌  
మే 19- సన్‌రైజర్స్‌ వర్సెస్‌ పంజాబ్‌


రోహిత్‌కు అవమానం!
ఐపీఎల్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ స్థానాన్ని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప‌దేప‌దే రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ పొజిషన్‌ను హార్దిక్ మారుస్తూ అభిమానుల అగ్ర‌హానికి గురయ్యాడు. సాధ‌ర‌ణంగా 30 యార్డ్ స‌ర్కిల్‌లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తూ క‌న్పించాడు. గుజ‌రాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవ‌ర్‌లో రోహిత్‌ను తొలుత మిడాన్‌లో ఫీల్డింగ్‌లో చేయ‌మ‌ని చెప్పిన హార్దిక్... తర్వాత హిట్‌మ్యాన్‌ను మ‌ళ్లీ లాంగాన్‌కు వెళ్లమ‌ని సూచించాడు. హార్దిక్‌ ఆదేశాలతో రోహిత్ ప‌రిగెత్తుకుంటూ లాంగాన్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు హార్దిక్ కావాల‌నే రోహిత్ ఫీల్డింగ్‌ను పొజిషన్‌ను మార్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. హార్దిక్‌ పాండ్యా బౌలర్లను వినియోగించుకున్న తీరుపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్‌, కెవిన్ పీటర్సన్‌ అసహనం వ్యక్తం చేశారు. బుమ్రా బదులు పాండ్య తొలి ఓవర్‌ వేయడం సరైంది కాదని మ్యాచ్‌ సందర్భంగా కామెంట్రీ చేస్తూ ఈ ముగ్గురు వ్యాఖ్యానించారు. తొలి ఓవర్‌ను బుమ్రా కాకుండా కెప్టెన్ హార్దిక్‌ వేశాడు. అతడు సంధించిన 8 బంతుల్లోనే గుజరాత్ ఓపెనర్లు 19 పరుగులు రాబట్టారు. తొలి ఓవర్‌ను బుమ్రా వేయకపోవడంపై ఇర్ఫాన్‌ పఠాన్‌ బుమ్రా ఎక్కడ అంటూ పోస్టు పెట్టడంతో వైరల్‌గా మారింది. పాండ్య బ్యాటింగ్ ఆర్డర్‌పైనా పఠాన్‌ విమర్శలు గుప్పించాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ను తప్పించుకోవడానికి టిమ్‌ డేవిడ్‌ను ముందు పంపించాడనే అర్థంలో వ్యాఖ్యలు చేశాడు