Rajasthan team strengths and weeknessess: ఐపీఎల్(IPL) సీజన్ 2024 చివరి దశకు వచ్చేసింది. లీగ్ దశలో భీకరంగా జరిగిన పోరాటంలో చివరికి నాలుగు జట్లే మిగిలాయి. కోల్‌కత్తా-హైదరాబాద్(KKR VS SRH), రాజస్థాన్- బెంగళూరు(RR VS RCB) ప్లే ఆఫ్‌కు చేరి కీలక సమరానికి సిద్ధమయ్యాయి. తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కత్తాతో హైదరాబాద్... రెండో ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌తో బెంగళూరు పోటీ పడనున్నాయి. ఈ తరుణంలో రేపు హైదరాబాద్... కోల్‌కత్తాను ఓడించి ఫైనల్‌కు చేరాలని వ్యూహాలు రచిస్తోంది. సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్ల మధ్య పోరు చాలా ఉత్కంఠభరితంగా సాగనుంది. హైదరాబాద్-కోల్‌కత్తా జట్టలో చాలా విషయాలు కలిసి వచ్చాయి. ఇరు జట్ల విజయాల్లో ఓపెనర్లే కీలకపాత్ర పోషిస్తున్నారు.
నరైన్ జోడీ దూకుడు..
కోల్‌కత్తా జట్టులో ఓపెనర్లు సాల్ట్, సునీల్ నరైన్ బ్యాట్‌తో అద్భుతాలు చేస్తున్నారు. కొన్ని మ్యాచుల్లో నరైన్ నిలకగడా రాణిస్తుండడం కోల్‌కత్తాకు కలిసి వస్తోంది. ఈ సీజన్‌లో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలతో నరైన్ 461 పరుగులు చేశాడు. సాల్ట్ 429 పరుగులు చేశాడు. నరైన్ బ్యాట్‌తో ఊచకోత కోస్తున్నాడు. మరోవైపు సాల్ట్ ఉన్నంతసేపు మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. నరైన్ ఇప్పటికే ఈ ఐపీఎల్‌లో ఓ శతకం కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్‌లో సునీల్ నరైన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే 461 పరుగులు చేయడంతోపాటు 15 వికెట్లు కూడా నేలకూల్చాడు. ఆల్‌రౌండ్ మెరుపులతో నరైన్ కోల్‌కత్తా జట్టులో కీలకంగా మారాడు. ఆండ్రీ రస్సెల్ ఈ సీజన్‌లో 222 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూడా తీశాడు. వరుణ్ చక్రవర్తి 18 వికెట్లతో మంచి లయలో ఉన్నాడు. ఫిల్ సాల్ట్ కూడా సంచలనాత్మక ఆరంభాలు అందిస్తున్నాడు. రఘువంశీ, రమణదీప్ సింగ్ కీలక సమయాల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న కోల్‌కత్తాతో గుజరాత్ పోరు రసవత్తరంగా సాగనుంది.
బౌలింగ్ మెరుగుపడాల్సిందే
బ్యాటింగ్‌లో కోల్‌కత్తా మెర్గుగానే ఉన్నా బౌలింగ్‌లో మాత్రం తేలిపోతుంది. నరైన్ మినహా మిగిలిన బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలకపోతున్నారు. మిచెల్ స్టార్క్ ఈ సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. గత మ్యాచ్‌లో మాత్రం పర్వాలేదనిపించాడు. కోల్‌కత్తా టైటిల్ దిశగా సాగాలంటే కచ్చితంగా చమీరా, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అట్కిన్సన్‌తో కూడిన బౌలింగ్ విభాగం గాడిన పడాల్సి ఉంది.
గంభీర్ వ్యూహాలు
గౌతమ్ గంభీర్ చేరికతో కోల్‌కత్తాలో పునరుత్సాహం కనిపిస్తోంది. గతంలో 2012, 2014 సీజన్లలో కెప్టెన్ గా కేకేఆర్‌కు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు గంభీర్. ఇప్పుడు మెంటార్‌గా వ్యవహరిస్తున్న గౌతీ జట్టు కొత్త బలాన్నిచ్చాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. కోల్‌కత్తా నెంబర్ వన్‌గా కొనసాగుతుంది. ఓపెనింగ్ జోడీ జట్టు సగం భారాన్ని తగ్గిస్తోంది. ఆండ్రీ రస్సెల్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి రాణించడంతో కోల్‌కత్తా నెంబర్ వన్‌గా లీగ్ స్టేజీని ముగించింది.