SRH vs PBKS Head to Head records : ఇండియన్ ప్రీమియర్ లీగ్  2024(IPL2024) లో 69వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌(PBKS)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రాణించి విజయంతో ఈ సీజన్‌ను ముగించాలని పంజాబ్‌ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరాలని హైదరాబాద్‌ కూడా భావిస్తోంది. పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉన్న హైదరాబాద్‌ను.. పంజాబ్‌ నిలువరించగలదేమో చూడాలి. హోంగ్రౌండ్‌లో అద్భుతంగా ఆడుతున్న హైదరాబాద్‌ను పంజాబ్‌ ఆపడం కష్టతరమే. 


హెడ్‌ టు హెడ్‌ రికార్డులు
ఐపీఎల్‌లో పంజాబ్, హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు ఆడగా.. హైదరాబాద్‌ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ కేవలం ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. మొహాలీలో ఇరు జట్లు ఆరు మ్యాచులు ఆడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచుల్లో గెలవగా... పంజాబ్‌ కింగ్స్‌ రెండు మ్యాచుల్లో గెలిచింది. హైదరాబాద్‌లో ఇరు జట్ల మధ్య ఎనిమిది మ్యాచులు జరగగా... హైదరాబాద్‌ రికార్డు స్థాయిలో ఏడు సార్లు విజయం సాధించగా.... పంజాబ్‌ ఒకే మ్యాచ్‌ గెలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత అయిదు మ్యాచుల్లో హైదరాబాద్‌ నాలుగు మ్యాచులు గెలవగా.. పంజాబ్‌ ఒకే మ్యాచ్‌ గెలిచింది. పంజాబ్‌-హైదరాబాద్‌ మ్యాచులలో డేవిడ్ వార్నర్ 700 పరుగులతో అత్యధిక పరుగులు చేశాడు. భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా 24 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ 18 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ పోటీలో ముందుంది. 


పిచ్‌ రిపోర్ట్‌:
.హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉండనుంది. బంతి బ్యాట్ మీదకు సులభంగా వస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో మీడియం పేసర్లకు ఈ పిచ్ సహకరించనుంది. అయితే సమయం గడిచేకొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్ మీదకు బంతి కొంచెం నెమ్మదిగా వస్తుంది. పిచ్ ఉపరితలం పొడిగా ఉంటుంది. దీని కారణంగా బౌన్స్‌కు, స్పిన్‌కు సహకరించనుంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్ .
పంజాబ్ కింగ్స్: మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (కెప్టెన్‌), సికందర్ రజా, రిషి ధావన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కావరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసోవ్.