ఈ రికార్డులు కూడా...
ఐపీఎల్‌లో గుజరాత్ చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇదే. లక్నోపై 130 పరుగులకు ఆలౌటైంది. గతేడాది ఢీల్లీపై 125 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో గుజరాత్ రెండోసారి మాత్రమే ఆలౌట్ అయింది. గతేడాది చెన్నైపై 157 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్‌పై ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా యశ్ ఠాకూర్ నిలిచాడు. అంతకుముందు ఉమ్రాన్ మాలిక్ (5/25), భువనేశ్వర్ కుమార్ (5/30) ఈ ఘనత సాధించారు. వీరిద్దరూ హైదరాబాద్ బౌలర్లే. లక్నో తరఫున అత్యుత్తమ ఎకానమీతో బౌలింగ్ చేసిన టాప్ బౌలర్ కృనాల్ పాండ్య. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటాలో 11 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
మ్యాచ్ సాగిందిలా..
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 163 లక్ష్యఛేదనలో గుజరాత్ మొత్తం వికెట్లు కోల్పోయి 130 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప ఛేదనలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కష్టాల్లో పడింది. రెండు పరుగుల వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కేన్ విలియమ్సన్(1) వెనుదిరిగాడు. రవి బిష్ణోయ్ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. కుడివైపు ఎగిరి మరీ బిష్ణోయ్ ఆ బంతిని అందుకున్నాడు. దాంతో, 56 పరుగులకే రెండో వికెట్ పడింది. అంతకుమందు యవ్ ఠాకూర్ బౌలింగ్‌లో ధాటిగా ఆడుతున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్(19) ఔటయ్యాడు. ఠాకూర్ వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతికి బౌల్డయ్యాడు. దాంతో, 54 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు 54/1. కృనాల్ పాండ్య కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. తరువాత కృనాల్ పాండ్య వేసిన 13 ఓవర్‌లో తొలి బంతికి దర్శన్ నల్కండే దొరికిపోయాడు. తరువాత నుంచి గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. గుజరాత్ జట్టులో ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరారు.న్ దీంతో 33 పరుగుల తేడాతో లఖ్‌నవూ ఘన విజయం సాధించింది.