IPL 2024 DC vs MI Match Head to head records : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) సీజన్‌లో 43వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో ముంబై  ఇండియన్స్‌(MI) తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలని ముంబై గట్టి పట్టుదలతో ఉంది. 

 

ఈ రెండు జట్ల రికార్డులివీ...

ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీ జట్లు 34 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ పోరుల్లో ముంబై ఇండియన్స్‌ 19 మ్యాచుల్లో గెలిచింది. ఢిల్లీ 15 మ్యాచుల్లో విజయం సాధించింది. ఫలితం రాని మ్యాచ్‌ ఒక్కటి కూడా లేదు. ముంబైలో ఈ రెండు జట్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్‌ ఆరుసార్లు విజయం సాధించగా.. ఢిల్లీ మూడు మ్యాచుల్లో గెలిచింది. ఢిల్లీలో ముంబై-ఢిల్లీ జట్లు 11 మ్యాచుల్లో తలపడగా.. ఢిల్లీ 6 సార్లు... ముంబై 5సార్లు గెలిచాయి.

 

ఢిల్లీ పిచ్‌ ఎలా ఉంటుందంటే..?

దేశంలోని పురాతన స్టేడియాల్లో అరుణ్‌ జైట్లీ (కోట్లా) ఒకటి. ఇప్పటికే ఈ మైదానంలో కొన్ని వందల మ్యాచులు జరిగాయి. ఈ పిచ్‌ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుంది. బ్యాటర్లు నిలబడితే పరుగులు చేయగలరు. ఇక్కడ ఛేజింగ్‌ చేసిన జట్టే అత్యధిక సార్లు విజయం సాధించింది. 

 

గత మ్యాచ్‌లో ఇలా...

ఈ ఐపీఎల్‌(IPL) సీజన్‌లో.. అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌(MI) ఢిల్లీపై గెలుపుతో ఈ ఎడిషన్‌లో తొలి విజయం నమోదు చేసింది. తొలుత ముంబై బ్యాటర్లు జూలు విదల్చగా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. చివరి ఓవర్‌లో ముంబై బ్యాటర్‌ రొమారియో షెఫర్డ్‌ ఏకంగా 32 పరుగులు రాబట్టి హార్దిక్‌ సేనకు భారీ స్కోరు అందించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ... నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులకే పరిమితమైంది. పృథ్వీ షా, స్టబ్స్‌ రాణించినా.. ఢిల్లీకి ఓటమి తప్పలేదు. రోహిత్ (49), ఇషాన్ (42) మంచి ఆరంభాన్ని అందించారు. చివర్లో టిమ్ డేవిడ్ (45నాటౌట్), షెఫర్డ్ (39నాటౌట్) రాణించడంతో ముంబై స్కోర్ 234 కు చేరింది. 235 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేవలం 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో పృథ్వీ (66), స్టబ్స్ (77) ఆఫ్ సెంచరీలు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేక పోయారు. 

 

జట్లు

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, యష్ ధుల్, షాయ్ హోప్, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, స్వస్తిక్ చికారా, ఇషాంత్ శర్మ, ఝే రిచర్డ్సన్, రసిఖ్ దార్ సలామ్, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, సుమిత్ కుమార్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్.

 

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్ (వికెట్), అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, హార్విక్ దేశాయ్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్.