MI vs GT Preview: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు 2023లో నేడు ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ (MI vs GT) ఢీకొంటున్నాయి. పాత మిత్రులు రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. ఈ పోరుకు వాంఖడే వేదిక. మరి ఈ ఇంట్రెస్టింగ్‌ కాంటెస్ట్‌లో గెలిచేదెవరు?


బౌలింగ్‌ డామినేషన్‌!


హార్దిక్ పాండ్య (Hardik Pandya) నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans) గురించి ఎంత చెప్పినా తక్కువే! అమేజింగ్‌, డేంజర్‌ బౌలింగ్‌ అటాక్‌తో ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. అలాగని బ్యాటింగ్‌లో తక్కువేం కాదు! భారీ టార్గెట్లు ఛేదిస్తున్నారు. ఈ పోరులో విజయం అందుకుంటే మిగతా మ్యాచులతో సంబంధం లేకుండా పాండ్య సేన టాప్‌-2 ఖాయం చేసుకుంటుంది. శుభ్‌మన్‌ సూపర్‌ డూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వృద్ధిమాన్‌ సాహా బ్లాస్టింగ్‌ ఓపెనింగ్స్‌తో చెలరేగుతున్నాడు. హార్దిక్‌, తెవాతియా, విజయ్ శంకర్‌, మిల్లర్‌తో మిడిలార్డర్ బాగుంది. ఈ సీజన్లో షమిని కొత్త బంతితో ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదు. అంతలా చెలరేగుతున్నాడు. మొహిత్‌ శర్మ, పాండ్య, జోసెఫ్‌ అతడికి అండగా ఉన్నారు. ఇక అఫ్గాన్‌ స్పిన్‌ ద్వయం నూర్‌ అహ్మద్‌, రషీద్‌ ఖాన్‌ ప్రత్యర్థులను ఆటాడుకుంటున్నారు. అందుకే టైటాన్స్‌పై ముంబయి గెలవడం అంత ఈజీ కాదు! పైగా చాలామందికి వాంఖడేలో అనుభవం ఉంది.


బ్యాటింగ్‌ డామినేషన్‌!


ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) ఎలాగైనా ప్లేఆఫ్‌ చేరుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఫామ్‌లో లేనప్పటికీ తనదైన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. ఆటగాళ్లంతా జోష్‌లో ఉండటం కాన్ఫిడెన్స్‌ పెంచింది. ఇషాన్‌ కిషన్‌ అమేజింగ్‌ ఓపెనింగ్‌ పాట్నర్‌షిప్స్‌ అందిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై పవర్‌ప్లేలో ఎదురుదాడికి దిగుతున్నాడు. వాంఖడేలో 200+ స్కోర్లను ముంబయి మిడిలార్డర్‌ ఈజీగా ఛేజ్‌ చేస్తోంది. సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar) మళ్లీ తన మునుపటి ఫామ్‌ అందుకున్నాడు. నేహాల్‌ వధేరా మ్యాచ్‌ విన్నర్‌గా అవతరించాడు. ఈ పోరుకు హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మ అందుబాటులో ఉన్నాడు. టిమ్‌ డేవిడ్‌, కామెరాన్‌ గ్రీన్‌ సైతం విలువైన ఇన్నింగ్సులే ఆడుతున్నారు. బౌలింగ్‌లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ నమ్ముకోవడానికి లేదు. స్పిన్‌ డిపార్ట్‌మెంట్‌లో పియూష్‌ చావ్లా, హృతిక్‌ షోకీన్‌, కుమార్‌ కార్తికేయ బాగున్నారు. కామెరాన్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో అంత పస కనిపించడం లేదు. ఆర్చర్‌ లేకపోవడం లోటే. బెరెన్‌ డార్ఫ్‌ ఫర్వాలేదు.


ముంబయి ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.


గుజరాత్ టైటాన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ.