Indian Premier League 2023: రాజస్థాన్ రాయల్స్ (RR)పై 112 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేయడం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌పై ఓటమి కచ్చితంగా ఆ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు రాజస్థాన్‌పై విజయంతో ఆ జట్టు మరోసారి విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చింది.


రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన ఫామ్ ఈ సీజన్‌లో కొనసాగింది. ఈ సీజన్‌లో నాలుగో అర్ధ సెంచరీని సాధించడంతో పాటు, ఫాఫ్ గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి రెండో వికెట్‌కు ముఖ్యమైన భాగస్వామ్యాన్ని కూడా పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 54 పరుగులు చేశాడు. దీంతో ఆర్‌సీబీ జట్టు 20 ఓవర్లలో 171 పరుగుల స్కోరు సాధించింది.


దీని తర్వాత, RCB బౌలర్లు తమ పనిని చక్కగా చేసి రాజస్థాన్ రాయల్స్‌ను కేవలం 59 పరుగులకే కట్టడి చేశారు. ఈ విజయంతో మ్యాచ్‌కు ముందు మైనస్‌లో ఉన్న ఆర్సీబీ నెట్ రన్‌రేట్ నేరుగా ప్లస్‌కు చేరుకుంది. ఇప్పుడు ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి కూడా చేరుకుంది.


ఇప్పుడు ఆర్సీబీ ప్లేఆఫ్‌లకు ఎలా చేరగలదు
ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇప్పుడు కేవలం రెండు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఈ రెండింటిలో విజయం సాధించడం చాలా ముఖ్యం. RCB తన తదుపరి మ్యాచ్‌ను మే 18వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, మే 21వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ఆడాల్సి ఉంది.


ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే RCB 16 పాయింట్లతో లీగ్ దశను ముగించనుంది. అయితే తమ విజయంతో పాటు మరికొన్ని మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆర్‌సీబీ ఆధారపడాల్సి ఉంటుంది. పంజాబ్ కింగ్స్‌ తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌లలో ఏదైనా ఒకదానిలో ఓటమిని చవి చూడాలి.


పంజాబ్ కింగ్స్ తన తదుపరి రెండు మ్యాచ్‌లను ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడాల్సి ఉంది. దీంతో పాటు ముంబై, లక్నో మధ్య జరిగే మ్యాచ్ కూడా ఆర్‌సీబీకి చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం ఆర్సీబీకి లాభిస్తుంది. లక్నో ఇప్పుడు 12 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఉంది.


ఐపీఎల్ 2023లో బెంగళూరుకు భారీ విజయం లభించింది. రాజస్తాన్ రాయల్స్‌పై 112 పరుగులతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ 10.3 ఓవర్లలో కేవలం 59 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యల్ప స్కోరు. కాగా రాజస్తాన్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. 2009 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైనే రాజస్తాన్ రాయల్స్ 58 పరుగులకు ఆలౌట్ అయింది.


రాజస్తాన్ బ్యాటర్లలో కేవలం షిమ్రన్ హెట్‌మేయర్ మాత్రమే ఓ మోస్తరుగా రాణించాడు. అతని ఇన్నింగ్స్ తీసేస్తే రాజస్తాన్ స్కోరు 24 పరుగులు మాత్రమే. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లలో ఫాఫ్ డు ఫ్లెసిస్ (55: 44 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (54: 33 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు.