IPL 2022, GT vs PBKS: గబ్బర్‌కు ఖాన్‌తో, కిల్లర్‌కు కాగిసోతో డిష్యూం డిష్యూం!

IPL 2022, GT vs PBKS: ఐపీఎల్‌ 2022లో డీవై పాటిల్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans), పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) తలపడుతున్నాయి. టైటాన్స్‌, కింగ్స్‌ మ్యాచప్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి.

Continues below advertisement

IPL 2022, GT vs PBKS: ఐపీఎల్‌ 2022లో డీవై పాటిల్‌ వేదికగా మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans), పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు గతంలో తలపడ్డప్పుడు టైటాన్సే గెలిచింది. ఈసారి మాత్రం తామే గెలవాలని పంజాబ్‌ పట్టుదలగా ఉంది. తెవాతియా వంటి షినిషర్లు సిక్సర్లు కొట్టకుండా అడ్డుకోవాలని అనుకుంటోంది. అందుకు తగ్గట్టే టైటాన్స్‌, కింగ్స్‌ మ్యాచప్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి.

Continues below advertisement

* పంజాబ్‌ కింగ్స్‌లో కాస్తో కూస్తో ఆడుతున్నది శిఖర్‌ ధావన్‌ (Shikar Dhawan). అతడిని అడ్డుకొనేందుకు గుజరాత్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan)ను ప్రయోగించనుంది. ఎందుకంటే అతడు 44 బంతులేసి 41 పరుగులిచ్చి 4 సార్లు ఔట్‌ చేశాడు.

* పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (Mayank Agarwal)దీ ఇదే పరిస్థితి. రషీద్‌ బౌలింగ్‌లో 23 బంతుల్లో 23 పరుగులే చేసి ఒకసారి ఔటయ్యాడు. అంటే ఈ ఓపెనర్లు ఇద్దరినీ ఔట్‌ చేసేందుకు హార్దిక్‌ పాండ్య పవర్‌ప్లేలోనే రషీద్‌ను ప్రయోగించే అవకాశం ఉంది.

* గుజరాత్‌ టైటాన్స్‌ మిడిలార్డర్‌లో డేవిడ్‌ మిల్లర్‌ (David Miller)దే కీలక పాత్ర. 69 సగటు, 150 స్ట్రైక్‌రేట్‌తో అతడు 276 పరుగులు చేశాడు. పంజాబ్‌ కింగ్స్‌లో రబాడా (Kagiso Rabada) అతడిని సైలెంట్‌గా ఉంచగలడు. ఎందుకంటే 30 బంతుల్లో 32 పరుగులే ఇచ్చి ఒకసారి ఔట్‌ చేశాడు.

* శుభ్‌మన్‌ గిల్‌ (Shubhman Gill)కు రబాడా రూపంలో ప్రమాదం ఉంది. అతడి బౌలింగ్‌లో 32 బంతులాడి 20 పరుగులే చేసి 2 సార్లు ఔటయ్యాడు.

* రషీద్ బౌలింగ్‌లో  లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (Liam livingstone)కు మంచి రికార్డే ఉన్నప్పటికీ ఎక్కువ సార్లు ఔటయ్యాడు. 52 బంతుల్లో 86 పరుగులు చేసినా 4 సార్లు ఔటయ్యాడు.

GT vs PBKS Probable XI

గుజరాత్‌ టైటాన్స్‌: శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా, సాయి సుదర్శన్‌, హార్దిక్‌ పాండ్య, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్, అల్జారీ జోసెఫ్‌, లాకీ ఫెర్గూసన్‌, మహ్మద్‌ షమి, యశ్‌ దయాల్‌/ ప్రదీప్‌ సంగ్వాన్‌

పంజాబ్‌ కింగ్స్‌: శిఖర్ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, భానుక రాజపక్స, జానీ బెయిర్‌స్టో, లియామ్‌ లివింగ్‌స్టన్‌, జితేశ్ శర్మ, రిషి ధావన్‌, కాగిసో రబాడా, రాహుల్‌ చాహర్‌, అర్షదీప్‌ సింగ్‌, సందీప్‌ శర్మ

Continues below advertisement