Super Overs In IPL History : ఐపీఎల్‌ 2025లో తొలిసారిగా బుధవారం రాత్రి సూపర్ ఓవర్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ టై అవ్వడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించారు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయో ఒకసారి చూద్దాం.

ఐపీఎల్‌లో 17 సీజన్లు జరిగాయి. ఇప్పడు 18వ సీజన్ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లలో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలింది. ఐపీఎల్‌లో మొదటి సూపర్ ఓవర్ మ్యాచ్‌ 23 ఏప్రిల్‌ 2009లో జరిగింది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తొలిసారిగా సూపర్ ఓవర్ ఆడాయి. ఇరు జట్లు కూడా 20 ఓవర్లలో 150 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా ఆరు బంతులు ఆడి 16 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. దాన్ని రజాస్థాన్‌ నాలుగు బంతుల్లోనే ఛేదించి విజయం సాధించింది. యూసుఫ్‌ పఠాన్ ఆ జట్టును గెలిపించాడు. 

  • 12 మార్చి 2010లో కింగ్స్‌ పంజాబ్‌ XI, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నైలో సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. ఇరు జట్లు ఇరవై ఓవర్లలో 136పరుగుల మాత్రమే చేశాయి. దీంతో సూపర్ ఓవర్‌లో పంజాబ్ 18 పరుగులు చేసి విజయం సాధించింది. 
  • 16 ఏప్రిల్ 2013లో మరో సూపర్ ఓవర్ జరిగింది. ఇది బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 152 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో ఢిల్లీ ఇచ్చిన 12 పరుగులను రెండు బంతుల్లోనే చేసిన ఏబీ డివిలియర్స్‌ బెంగళూరును గెలిపించాడు. 
  • 19 ఏప్రిల్ 2013లోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ మరో సూపర్ ఓవర్ ఆడారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు 130 పరుగులు చేశాయి. సూపర్ ఓవర్‌లో బెంగళూరు ఇచ్చిన టార్గెట్‌ను హైదరాబాద్ ఆ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. 
  • 29  ఏప్రిల్ 2014లో రాజస్థాన్‌ రాయల్స్‌ కోల్‌కతా మధ్య జరిగింది మరో సూపర్ ఓవర్. రాజస్థాన్ రాయల్స్  11 పరుగులు చేసి విజయం సాధించింది. 
  • 21 ఏప్రిల్ 2015లో కింగ్స్ పంజాబ్ XIతో రాజస్థాన్ రాయల్స్ ఆడాల్సి వచ్చింది. అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ సూపర్ ఓవర్‌లో 12 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 
  • 29 ఏప్రిల్ 2017లో ముంబై ఇండియన్స్‌, గుజరాత్ లయన్స్ మధ్య సూపర్ ఓవర్‌ ఫైట్ జరిగింది. ఇందులో ముంబై 11 పరుగులు ఛేదించి విజయం సాధించింది. 
  • 2 మే 2019లో ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్ మధ్య సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో ముంబై ఇండియన్ 9 పరుగులు చేసి విజయానికి చేరుకుంది.  
  • 8 మే 2019లో  ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా మధ్య ఢిల్లీలో సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ పది పరుగులు చేసి విజయం సాధించింది. 
  • 20 సెప్టెంబర్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్  దుబాయ్‌లో ఓ మ్యాచ్‌లో సూపర్  ఓవర్ ఆడాయి. ఇందులో ఢిల్లీ రెండు పరుగులు ఛేదించి విజయాన్ని ముద్దాడింది. 
  • 28 సెప్టెంబర్ 2020లో దుబాయ్‌లోనే జరిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌, ముంబై మధ్య జరిగిన సూపర్ ఓవర్‌లో ఆర్సీబీ గెలిచింది. 
  • 18 అక్టోబర్ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సన్‌సైజర్స్ మధ్య అబుదాబిలో సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. ఇందులో కోల‌్‌కతా రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 
  • 18 అక్టోబర్ 2020లో అదే రోజు రాత్రి దుబాయ్‌లో జరిగిన మరో మ్యాచ్‌ కూడా సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ జట్లు రెండుసార్లు సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్, ముంబై మధ్య జరిగిన మొదటి సూపర్ ఓవర్‌ టై అయింది. రెండు జట్లు కూడా ఐదేసి పరుగులు చేశాయి.  దీంతో రెండో సూపర్ ఓవర్ ఆడించారు. దీంటో పంజాబ్ 11 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. 
  •  8 అక్టోబర్ 2021లో మ్యాచ్‌ కూడా దుబాయ్‌లో జరిగింది. ఈమ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్ సూపర్ ఓవర్ ఆడాయి. ఢిల్లీ మూడు పరుగులు చేసి విజయం సాధించింది. 
  • బుధవారం రాత్రి ఆడిన సూపర్ ఓవర్‌తో పోల్చుకుంటే 15 సూపర్ ఓవర్లు జరిగాయి. ఇందులో 2020లోనే ఎక్కువసూపర్ ఓవర్‌లు జరిగిన సీజన్‌గా రికార్డు ఉంది. ఎక్కువ సూపర్ ఓవర్లు ఆడిన జట్టుగా ముంబై ఇండియన్స్ పేరున రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టు నాలుగు సూపర్ ఓవర్లు ఆడింది. 

ఏంటీ సూపర్ ఓవర్ఐపీఎల్‌లో మ్యాచ్‌లు టై అయినప్పుడు ఈ సూపర్ ఓవర్ ఆడాల్సి ఉంటుంది. రెండు జట్లు కూడా ఒక ఓవర్ బ్యాటింగ్ చేస్తాయి. క్లోజ్ ఫీల్డింగ్ పెట్టి ఆరు బంతులు వేయాల్సి ఉంటుంది. ఇలా రెండు జట్లకు ఛాన్స్ ఇస్తారు. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్లను విజేతలుగా ప్రకటిస్తారు.