Ambati Rayudu feels MS Dhoni is not finished yet: ధోనీ (Dhoni) ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడని క్రికెట్ ప్రపంచం భావిస్తున్న వేళ టీమిండియామాజీ ఆటగాడు అంబటి రాయుడు(Ambati Rayudu) కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని తన కెరీర్‌లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని తేల్చి చెప్పాడు. ధోని మరింత కాలం కొనసాగేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను బీసీసీఐ(BCCI) కొనసాగించాలని కూడా రాయుడు విజ్ఞప్తి చేశాడు. బెంగళూరుతో జరిగిన కీలకమైన మ్యాచ్చే ధోనికి చివరి ఐపీఎల్ మ్యాచ్ అని తాను భావించట్లేని రాయుడు స్పష్టం చేశాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోని ఔటైనప్పుడు కాస్త అసంతృప్తిగా... నిరుత్సాహంగా కనిపించాడని.. అతనెప్పుడూ అలా ఉండడని రాయుడు అన్నాడు. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి గొప్పగా ముగించాలని ధోనీ భావించి ఉంటాడని... అది సాధ్యం కాలేదు కాబట్టి ధోనీ మళ్లీ వచ్చే ఏడాది బరిలోకి దిగే అవకాశం ఉందనే రాయుడు చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ధోనీకి కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా విశ్లేషించాడు. బీసీసీఐ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగిస్తే అభిమానులకు ధోనీ ఆట చూసే అవకాశం లభిస్తుందని తెలిపాడు.
ఈ సీజన్ మొత్తానికే భారీ సిక్సర్ బాదిన ధోనీ
రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ధోనీ చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో చివరి ఓవర్‌లో ఇప్పటికే కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ... బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ రాణించాడు. ధాటిగా బ్యాటింగ్ చేసి 13 బంతుల్లో 25 పరుగులు చేసి చెన్నైను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించాడు. యశ్ దయాలు వేసిన చివరి ఓవర్ తొలి బంతికి ధోనీ 110 మీటర్ల సిక్స్ బాదాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లోనే ఇదే భారీ సిక్సర్ కావడం గమనార్హం. యశ్ దయాల్ వేసిన బంతి మిడిల్ -లెగ్‌పై టాస్‌గా పడింది. ఈ బంతిని అందుకున్న ధోనీ.. ఫైన్ లెగ్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఆ సిక్స్ దాదాపుగా 110 మీటర్ల దూరం పడింది. అంతే చెన్నై లక్ష్యం అయిదు బంతుల్లో 11 పరుగులకు తగ్గింది. అ తర్వాతి బంతికే ధోనీ అవుట్ కావడంతో బెంగళూరు గెలిచి ప్లే ఆఫ్‌కు చేరింది.
అంతే కాదు చివరి ఓవర్‌లో ధోనీ క్రీజులో ఉంటే అంతే సంగతులు. బౌలర్‌పై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడతాడు. ఇలా ఐపీఎల్ 20వ ఓవర్‌లో ధోనీ ఇప్పటివరకు 66 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజన్‌లోనూ ధోనీ 5 ఇన్నింగ్స్‌లలో 255.88 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా 5000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ధోనీ ఉన్న ఫామ్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అసలు మొదటి ముగ్గురు, నలుగురు బ్యాటర్ లు అవుట్ అయినా csk ఫాన్స్ ఫీల్ అవ్వటం మానేశారు . అంటే వారికి తెలుసు. ధోనీ వస్తాడని, ఆట లెక్క మారుస్తాడాని.