Hardik Pandya Instagram Story: హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ - ధోని సీఎస్‌కేతో లింక్ పెడుతున్న ఫ్యాన్స్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫొటో క్రికెట్ ఫ్యాన్స్ మధ్య సరికొత్త చర్చకు దారితీసింది.

Hardik Pandya Instagram Story Sparks MS Dhoni CSK Rumours: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ (MI) ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా యాక్టివిటీ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీజన్ లో ఐదుసార్లు ఛాంపియన్స్ అయిన ముంబై టీమ్ వరుసగా ఓటములను చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో కూడా ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో కేవలం 4 విజయాలతో 9వ స్థానంతో ఈ ఏడాది ప్రయాణాన్ని ముగించింది. హార్దిక్ పాండ్యాకు కూడా ఈ సీజన్ గాయాలు, ఫామ్ లేమితో చాలా భారంగా గడిచింది. ఈ నేపథ్యంలో సీజన్ ముగిశాక హార్దిక్ ముంబై టీమ్ ను వీడనున్నాడనే వార్తలు వస్తున్న తరుణంలో ఆయన పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచింది.
ఫోన్ స్క్రీన్ పై 07:07 టైమింగ్..
హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫొటోను షేర్ చేశాడు. ఆ పిక్చర్‌లో ఒక లాప్‌టాప్ లో సినిమా ప్లే అవుతుండగా, పక్కనే ఒక నోట్‌బుక్, పెన్, ఆయన మొబైల్ ఫోన్ ఉన్నాయి. అయితే నెటిజన్ల కళ్ళు ఆ ఫోన్ స్క్రీన్ పై ఉన్న టైమింగ్ పై పడ్డాయి. అందులో సమయం '07:07' అని చూపిస్తోంది. క్రికెట్ ప్రపంచంలో నంబర్ '7' అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని. ఇంటర్నెట్ లో ధోని తలా మీమ్స్ కు ఈ నంబర్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీంతో హార్దిక్ కావాలనే ధోనిని ఉద్దేశించి ఆ టైమ్ కనిపించేలా ఫొటో తీశారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
సీఎస్‌కే లోకి హార్దిక్ ..
ఈ '07:07' కనెక్షన్ చూసిన ఒక సెక్షన్ క్రికెట్ ఫ్యాన్స్ భవిష్యత్తులో హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులోకి మారబోతున్నాడనే హింట్ ఇస్తున్నట్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ వైరల్ టాక్ పై అటు హార్దిక్ పాండ్యా కానీ, ఇటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సీజన్ లో ముంబై ఫ్యాన్స్ నుండి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న హార్దిక్, వచ్చే ఏడాది మెగా వేలంలో ముంబై ఇండియన్స్ టీమ్‌ను వీడే అవకాశాలు ఉన్నాయనే రూమర్స్ ఈ స్టోరీతో మరింత ఎక్కువయ్యాయి.
కీరన్ పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ జట్టు డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ పై స్పందిస్తూ హార్దిక్ ఫ్యూచర్ గురించి ఇప్పుడే మాట్లాడటం కరెక్ట్ కాదని స్పష్టం చేశాడు. సీజన్ ముగిసిన వెంటనే భావోద్వేగాలతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని చెప్పాడు. మేనేజ్‌మెంట్, ప్లేయర్స్ అందరికీ కొంత సమయం, స్పేస్ అవసరమని, ఎక్కడ తప్పు జరిగిందో కూర్చొని సమీక్షించుకున్నాకే ఒక స్పష్టమైన అంచనాకు రాగలమని పేర్కొన్నాడు. ఇప్పుడే కూర్చొని అది చేయాలి, ఇది మార్చాలి అని బాధ్యతారాహిత్యంగా మాట్లాడలేమని, సరైన సమయంలో మేనేజ్‌మెంట్ బెస్ట్ డెసిషన్ తీసుకుంటుందని పొలార్డ్ భరోసా ఇచ్చాడు.
Before You Go
Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















