GT vs CSK Weather Update:
టీ20 క్రికెట్ ఫెస్టివల్ వచ్చేసింది. సరికొత్త సీజన్ తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్రమోదీ స్టేడియం ఇందుకు వేదిక. అయితే అహ్మదాబాద్‌లోని మొతేరాలో వర్షం కురిసే అవకాశం ఉంది.
ఏడాది తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగు మొదలవుతుండటంతో అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. తొలి మ్యాచులోనే గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతుండటంతో ఎవరు గెలుస్తారోనన్న ఆత్రుత కనిపిస్తోంది. ఒకటి డిఫెండింగ్ ఛాంపియన్ కావడం, మరోటి నాలుగు సార్లు విజేత కావడంతో ఈ మ్యాచు కోసం ఎదురు చూస్తున్నారు.
శుక్రవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ టాస్ వేస్తారు. 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. తొలి మ్యాచు కావడంతో వాతావరణం ఎలా ఉంటుందోనన్న సందేహాలు మొదలయ్యాయి. కాగా మొతేరాలో గురువారం వర్షం కురిసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సాధన చేస్తుండగా జల్లులు రాలాయి.
గుజరాత్‌లో ఎడారి ఉండటంతో వాతావరణం ఉక్కపోత, వేడిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కురిసిన చిరు జల్లులు ఆనందాన్ని ఇచ్చినా మ్యాచ్ రోజు మాత్రం పడొద్దని అభిమానులు, ఫ్రాంచైజీలు కోరుకుంటున్నాయి. వెదర్ వెబ్‌సైట్లు, వాతావరణ శాఖ ప్రకారం శుక్రవారం మొతేరాలో వర్షం కురిసేందుకు 4 శాతం వరకు ఆస్కారం ఉంది.
అంటే.. మ్యాచ్ జరిగుతున్నప్పుడు అప్పుడప్పుడూ అలా చినుకులు పడే అవకాశం లేకపోలేదు. మ్యాచ్ ఆగిపోయేంతగా వర్షమైతే కురవకపోవచ్చు. ఒకవేళ కొద్దిసేపు వరుణుకు వస్తే మాత్రం ఏదో ఒక జట్టుకు ఇబ్బంది తప్పుదు. బౌలింగ్ లేదా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోతుంది. కాగా గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీలు ఉండనుంది.
పిచ్ ఎలా ఉంటుందంటే?
మొతేరాలో ఆరు ఎర్రమట్టి, ఐదు నల్లమట్టి పిచ్‌లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ ఇందులో ఏ పిచ్ ఉపయోగిస్తుందో తెలియదు. గతేడాది ఐపీఎల్‌కు సీమర్లకు అనుకూలించే పిచ్ వాడారు. బహుశా ఇప్పుడూ అదే వాడొచ్చు. బౌన్స్ అయ్యే పిచ్‌పై జీటీని ఎదుర్కోవడం ఈజీగా కాదు. ఆకాశం నిర్మలంగానే ఉంటుంది. గాల్లో ఎలాంటి తేమ ఉండదు.
తుది జట్లు (GT vs CSK Playing XI)
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, శివమ్ మావి, జయంత్ యాదవ్ / సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమి. మ్యాచ్ పరిస్థితులను బట్టి అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉపయోగించుకోవచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్: రుతరాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ మావి, రాజ్‌వర్దన్ హంగర్‌గేకర్, ఎంఎస్ ధోనీ, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, సిమ్రన్‌జీత్ సింగ్ / తషార్ దేశ్‌పాండే. మొదట బ్యాటింగ్, బౌలింగ్ చేయడాన్ని బట్టి అజింక్య రహానె, షేక్ రషీద్, రాజ్‌వర్దన్, అంబటి రాయుడుని ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకోవచ్చు.