Mumbai Indians Captain Hardik Pandya - హర్దిక్ పాండ్య..! ప్రస్తుత సీజన్ లో బ్యాడ్ లక్ కు మారుపేరుగా నిలుస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ ను ఓ సారి విన్నర్ గా,మరోసారి రన్నరప్ గా నిలబెట్టిన కెప్టెన్ హర్దిక్ పాండ్య. అలాంటి బ్రాండ్ ఇమేజ్ తో ముంబయి కెప్టెన్ గా మారితే కథ అంతా రివర్స్ ఐంది. ఇక్కడ మ్యాచ్ విజయాలు లేవు. బ్యాటింగ్ లో మెరుపులు లేవు. బౌలింగ్ లో అరుపులు లేవు. హర్దిక్ పాండ్యకు రోహిత్ ఫ్యాన్స్ నుంచే కాదు.. డ్రెస్సింగ్ రూంలో కూడా సరైన సపోర్ట్ దొరకట్లేదేమోనని అనిపిస్తోంది. ఆ లోపం వల్లే..ముంబయి ఇండియన్స్ కేవలం 3 విజయాలతో పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో ఉంది. ఇది హర్దిక్ పాండ్య కెప్టెన్సీని ప్రశ్నిస్తోంది.
బ్యాటర్‌గా, బౌలర్‌గానూ నో ఇంపాక్ట్..
ఇక ఆల్ రౌండర్ గానూ హార్ధిక్ పాండ్యా విఫలమవుతున్నాడు. 9 మ్యాచుల్లో కేవలం 197 పరుగులు మాత్రమే కొట్టాడు. అందులో నిన్న దిల్లీపై ఆడిన 46 పరుగులే అత్యధిక స్కోర్. ఇక బౌలింగ్ లో ఐతే అట్టర్ ప్లాప్..దాదాపు ఓవర్ కు 12 పరుగులు ఇస్తూ..కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇలా... ఏ విభాగంలోనూ రాణించకలేకపోతున్న హర్దిక్ కు..ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో స్థానం పెద్ద సమస్యగా మారింది. ఆల్ రౌండర్ పోజిషన్ కు శివమ్ దూబె, రింకూసింగ్ లు గట్టి పోటీనిస్తున్నారు.
ఈ సమయంలో...హర్దిక్ పాండ్య ప్లేయింగ్ 11లో కాదు..మొత్తం 15 మందితో కూడా జట్టులో స్థానం దొరకడమే కష్టంగా మారింది. ఇదంతా చూస్తుంటే..కొన నాలుకకు మందేయడానికి పోతే ఉన్న నాలుక ఊడిందంటా అట్లుంది హర్దిక్ పాండ్య పరిస్థితి. గుజరాత్ లో రాజా లెక్క బతికేటోడు. ఆశ పడి ముంబయికి పోతే.. ఇప్పుడు టీం ఇండియాలో ప్లేస్ కోల్పోయే పరిస్థితిలో పడ్డాడు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. 9 మ్యాచ్ లాడిన ముంబై కేవలం 3 మ్యాచ్ లు గెలిచి 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఆ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే ఏదైనా సంచలనాలు జరగాల్సిందే.