Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Delhi Capitals news: రిషభ్ పంత్ మెంటాలిటీపై ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ బదానీ బాంబ్ పేల్చాడు. తను డీసీ జట్టును వీడటం వెనుక పంత్‌కు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు.
IPL auction Update:భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పై ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ హేమంగ్ బదానీ సంచలన ఆరోపణలు చేశాడు. అధికంగా డబ్బు వస్తుందనే కారణంతోనే ఐపీఎల్లో తమ జట్టును వీడి వెళ్లాడని పేర్కొన్నాడు. నిజానికి ఢిల్లీ జట్టుకు ఆది నుంచి పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలాగానే పంత్ కూడా ఢిల్లీకి చెందినవాడే. దీంతో తనను తీసుకునేందుకు ఢిల్లీ ఉత్సాహం చూపించింది. ఎర్లీ స్టేజ్ లోనే పంత్ ప్రతిభను గుర్తించి, తన ఆటకు మెరుగులు దిద్దింది.
యాక్షన్ లో ఎక్కువ డబ్బు వస్తుందనే..
ఢిల్లీ క్యాపిటల్ ను వదిలి వెళ్లేందుకు గల కారణాన్ని కోచ్ బదానీ వివరించే ప్రయత్నం చేశాడు. నిజానికి రిటెన్షన్ పాలసీలో భాగంగా లభించే డబ్బు తన ప్రతిభకు తక్కువనే పంత్ భావించినట్లు పేర్కొన్నాడు. పాలసీలో భాగంగా రూ.18 కోట్లను పంత్ కు ఢిల్లీ యాజమాన్యం ఆఫర్ చేసింది. అయితే ఆ మొత్తం తనకు చాలా తక్కువని పంత్ భావించి, యాక్షన్ లోకి వెళ్లేందుకే మొగ్గు చూపినట్లు బదానీ వివరించాడు. వేలంతో తనను తాను పరీక్షించుకోవాలని పంత్ భావించినట్లు పేర్కన్నాడు. అంతకుముందు ఏడాది జరిగిన వేలంలో స్టార్క్ 24 కోట్లు, కమిన్స్ కు 20 కోట్ల పైబడి ధర పలకడంతో పంత్ ఆలోచన ధోరణి మారిందేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు.
పంత్ నిర్ణయమే కరెక్ట్..
నిజానికి పంత్ ఏదైతే భావించి ఐపీఎల్ మెగా వేలంలోకి వచ్చాడో అదే జరిగిందని అతని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. రూ.27 కోట్లు వెచ్చించి లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం తనను దక్కించుకుంది. నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో రైట్ టు మ్యాచ్ లో భాగంగా పంత్ ను దక్కించుకునేందుకు ప్రయత్నించగా, కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేసిన లక్నో పంత్ ను తన ఖాతాలో వేసుకుంది.
పంత్, ఢిల్లీ యాజమాన్యం భిన్న వాదనలు..
అంతకుమందు ఢిల్లీ జట్టును వీడటంలో డబ్బు పాత్ర లేదని పంత్ ట్వీట్ చేశాడు. డబ్బు కన్నా జట్టుతో కొన్ని అంశాల్లో వచ్చిన పొరపొచ్చాలే కారణం అయిు ఉంటుందని భారత మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ అభిప్రాయ పడ్డాడు. మరోవైపు ఢిల్లీ యజమాని పార్థ్ జిందాల్ ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకున్నాడు. మిస్ కమ్యూనికేషన్ వల్లే పంత్ తమ జట్టును వీడాడని పేర్కొన్నాడు. నిజానికి జట్టుకు సంబంధించి పంత్ కు ఫీడ్ బ్యాక్ ఇచ్చామని, అయితే దాన్ని అర్థం చేసుకోవడంలో పంత్ పొరపడ్డాడని తెలిపాడు.
Also Read: Ind Vs Aus 2nd Test: సిరాజ్ మియా.. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ @ 181.6 కేపీహెచ్.. ఏది నిజం..?
ఈక్రమంలో జట్టును వీడాలనే ఎమోషనల్ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అభిప్రాయ పడ్డాడు. మొత్తానికి ఢిల్లీ టీమ్ లో పంత్ జరిపిన ప్రయాణం మధురమైనదని, అతనితో టీమ్ మేనేజ్మెంట్ కి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పంత్ గాయపడి ఐపీఎల్ కు దూరమైనప్పుడు, పెవిలియన్ వద్ద పంత్ జెర్సీ పెట్టి, అతనికి సంఘీభావం ప్రకటించిన విషయాన్ని పేర్కొంటున్నారు.