‘క్యాచ్‌లే మ్యాచ్‌లను గెలిపిస్తాయి.’ క్రికెట్ గురించి పరిచయం ఉన్నవారికి ఈ మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ అలాంటి కీలకమైన మ్యాచ్‌ను వదిలేసింది. ఈ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ ఎంతటి ఫాంలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 851 పరుగులతో అత్యధిక పరుగులు సాధించాడు. అలాంటి గిల్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డర్ దీపక్ చాహర్ వదిలేశాడు.
తుషార్ దేశ్ పాండే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో నాలుగో బంతిని శుభ్‌మన్ గిల్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ వైపు ఆడాడు. అది సరిగ్గా దీపక్ చాహర్ చేతిలో పడింది. కానీ దాన్ని అతను సరిగ్గా పట్టుకోలేకపోయాడు. అప్పటికి శుభ్‌మన్ గిల్ స్కోరు కేవలం మూడు పరుగులు మాత్రమే. ఈ క్యాచ్ చెన్నైకి ట్రోఫీని దూరం చేస్తుందా లేదా అనేది కాసేపట్లో తెలుస్తుంది. దీనిపై ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. కీలకమైన మ్యాచ్‌లో ఇలాంటి క్యాచ్‌ను మిస్ చేస్తే ఎలా అని దీపక్ చాహర్‌పై విరుచుకుపడుతున్నారు.
దీన్ని శుభ్‌మన్ గిల్ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (36 బ్యాటింగ్: 17 బంతుల్లో, ఏడు ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (27: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నాడు. గిల్ 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటింగ్‌కు దిగింది.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
జాషువా లిటిల్, కేఎస్ భరత్, ఒడియన్ స్మిత్, సాయి కిషోర్, శివం మావి
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
శివం దూబే, మిషెల్ శాంట్నర్, సుభ్రాంషు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్