Prabhsimran Singh: ఐపీఎల్ 2023 59వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ సెంచరీ సాధించాడు. 65 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పంజాబ్ ఓపెనర్ 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. అతనికి ఐపీఎల్ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. తొలి 30 బంతుల్లో 27 పరుగులు చేసిన సింగ్.. తర్వాతి 35 బంతుల్లోనే 76 పరుగులు సాధించాడు.


దీంతో ప్ర‌భ్‌సిమ్ర‌న్ ఒక ప్ర‌త్యేక రికార్డు సృష్టించాడు. అతను రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్‌ల సరసన ప్రత్యేకమైన క్లబ్‌లో చేరాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన ఆరో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా ప్రభ్‌సిమ్రన్ సింగ్ నిలిచాడు. 22 ఏళ్ల 276 రోజుల వయసులో ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఐపీఎల్‌లో సెంచరీ సాధించాడు. గతంలో సంజూ శామ్సన్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్, మనీష్ పాండేలు కూడా ఈ ఘనత సాధించారు.


ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు
19 సంవత్సరాల 253 రోజులు - మనీష్ పాండే (RCB) వర్సెస్ డెక్కన్ ఛార్జర్స్, సెంచూరియన్, 2009
20 సంవత్సరాల 218 రోజులు - రిషబ్ పంత్ (ఢిల్లీ) వర్సెస్ SRH, ఢిల్లీ, 2018
20 సంవత్సరాల 289 రోజులు - దేవదత్ పడిక్కల్ (RCB) వర్సెస్ రాజస్థాన్, ముంబై , 2021
21 సంవత్సరాల 123 రోజులు - యశస్వి జైస్వాల్ (రాజస్థాన్) వర్సెస్ ముంబై ఇండియన్స్, ముంబై, 2023
22 సంవత్సరాల 151 రోజులు - సంజు శాంసన్ (ఢిల్లీ) వర్సెస్ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, పుణె, 2017
22 సంవత్సరాల 276 రోజులు - ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (పంజాబ్) వర్సెస్ ఢిల్లీ, ఢిల్లీ, నేటి మ్యాచ్


సెంచరీ తర్వాత ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మాట్లాడుతూ, ‘నేను సమయం తీసుకొని లూజ్ బాల్స్‌ను ఆడాలని అనుకున్నాను. నేను సీజన్‌ను ప్రారంభించినప్పుడు దీన్ని మంచి సీజన్‌గా మార్చాలనుకుంటున్నాను. పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉంది. కానీ క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మెన్‌లకు ఆడటం సులభం అవుతంది. దేశవాళీ క్రికెట్‌లో కూడా ఇలాగే ఆడను. ఈ వికెట్‌పై ఫాస్ట్ బౌలర్లను ఆడటం చాలా సులభం, బంతులు నా స్లాట్‌లో పడ్డాయి.’ అన్నాడు.